BHPL: జిల్లాలో నూతన గోరికొత్తపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల రాకేష్ ఇవాళ డిమాండ్ చేశారు. ఈ నెల 29న పెద్ద బతుకమ్మ సందర్భంగా రసన్ కుంటా రోడ్డుపై బతుకమ్మ నిర్వహిస్తారని, రోడ్డు రద్దీ వల్ల మహిళలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. స్థానిక ఎమ్ఆర్వో లక్ష్మీ రాజయ్యను స్థలం సేకరించి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.