ELR: జీలుగుమిల్లి మండలంలో నిర్మాణం కాబోయే నేవీ ఆయుధ డిపోపై అపోహలను నమ్మొద్దని ఎమ్మెల్యే బాలరాజు శనివారం అన్నారు. ఇది ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేశారు. 1129 ఎకరాల్లో భూసేకరణ జరిగినప్పటికీ, కేవలం 33 ఎకరాల్లోనే డిపో నిర్మాణం జరగనుంది. మిగిలిన భూమిలో ఉద్యోగుల కోసం ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రి వంటి సౌకర్యాలు ఏర్పడతాయన్నారు.