CTR: ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాలలో ట్రాఫిక్ ఈ -చలానాలలో 50 శాతం డిస్కౌంట్ పేరుతో వస్తున్న తప్పుడు లింకులను ప్రజలు నమ్మరాదని చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ సూచించారు. సెప్టెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఈ-చలానాలలో డిస్కౌంట్ ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ, మోసాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరించారు.