KMR: బీర్కూర్, తిమ్మాపూర్ గ్రామాల శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు నందకిషోర్ ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ కమిటీ నిర్వాహకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నరసరాజు ఉన్నారు.