NLG: మిర్యాలగూడ (M) యాద్గారిపల్లికి చెందిన రంగయ్య ఒక పోరాట యోధుడు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దళ కమాండర్‌గా పనిచేసి ఎన్నో పోరాటాలు చేశారు. ఈ కారణంగా ఔరంగాబాద్ జైలులో ఆరేళ్లు, ముషీరాబాద్ జైలులో రెండేళ్లు జైలు జీవితాన్ని గడిపారు. సర్పంచ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొదటిసారి యాద్గారిపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ మొదటి ఎంపీపీగా ఎన్నికయ్యారు.