BDK: జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం మణుగూరు పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజల తరఫున ప్రశ్నించే తమపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై రంజిత్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే తమపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు.