NDL: పాణ్యంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా.. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధించే బోధనా అంశాలు, లెసన్ ప్లాన్ రిజిస్టర్లు వార్షిక ప్రణాళికలను ఆయన పరిశీలించారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవోలు పాల్గొన్నారు.