NDL: వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం అసెంబ్లీలో సహచర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లాలో క్వింటా జొన్నలకు మద్దతు ధర రూ.2400 నుంచి రూ.3400/-కు పెంచి, జొన్న రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నకు వినతి పత్రం అందజేశారు.