KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కంకణధారణ వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు.
సత్యసాయి: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖశాంతులు విరాజిల్లాలని ఆకాంక్షించారు. శ్రీరాముని పాలనను ఆదర్శంగా తీసుకుని CM చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.
ATP: మంత్రి నిమ్మల రామానాయుడును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. కళ్యాణదుర్గం ప్రాంత జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చూడాలని, ఇందుకోసం సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రికి విన్నవించారు.
W.G: నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణేశ్వరం, సారవ, వై.ఎస్ పాలెం, ఎల్ బీ చెర్ల, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక, వేములదీవి వెస్ట్, వేములదీవి ఈస్ట్ మరియు ధర్భరేవు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.12,28,633 విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.
KDP: క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై ప్రొద్దుటూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఐపీఎల్ నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నేర చరిత్ర ఉన్న వారిపై పర్యవేక్షణ పెంచారు. పాల్గొన్న వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ఏఎస్పీ విబు కృష్ణా హెచ్చరించారు. యువత బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అన్నమయ్య: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో, లయన్ హరినాద్ రెడ్డి (హరి పాపులర్ షూ కంపెనీ) సౌజన్యంతో సంబేపల్లి మండలంలోని అడవికమ్మపల్లె, గాండ్లపల్లి, మాదిగపల్లె ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సుమారు 120 జతల పాదరక్షలు ఉచితంగా పంపిణీ చేశారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు లయన్ శ్యామ్ తెలిపారు.
EG: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు , కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు మంత్రి కందుల దుర్గేష్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాజమండ్రి మంత్రి నివాసంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు . క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సకాలంలో గుర్తించి త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు.
సత్యసాయి: నల్లమాడ సర్కిల్ కొండకమర్లలో పోలీసులు బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ అంకిత సురాన పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాల సహాయంతో మెరుపు దాడులు చేపట్టారు. సరైన పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేసి, పాత నేరస్థుల ఇళ్లలో సోదాలు చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయాలపై సిఐ శ్రీనివాసులు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
NLR: నగరపాలక సంస్థ కార్యాలయంలో పని చేయుచున్న రికార్డు అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. కోటేశ్వరి, ఎన్. విజయ, బి. శివ, ఎం. రంగనాయకుల రెడ్డి, టి. నాగయ్యలకు ఉద్యోన్నతి లభించింది. జూనియర్ సహాయకులుగా నియమిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గురువారం ఉత్తర్వులను అందచేశారు.
కృష్ణా: గుడివాడ (M) లింగవరం గ్రామం నుంచి మల్లాయిపాలెం టిడ్కో కాలనీ వరకు సామాజిక కార్యకర్త రవికిరణ్ గురువారం పాదయాత్ర చేశారు. లింగవరం గ్రామంలో ఎప్పటినుండో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల మార్పు కోసం గతంలో అర్జీలను సమర్పించానని అన్నారు. బైపాస్ రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఈఈ శ్రీనివాస్‌కి అర్జీని సమర్పించడం జరిగిందని తెలిపారు.
GNTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఒబేసిటీ ముక్త్ భారత్-మిషన్ హెల్తీ భారత్’ పేరిట చేపట్టిన తన బైక్ యాత్ర వివరాలను ఆమె ఆయనకు వివరించారు. 500కు పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
కర్నూలు: వేసవికాలపు సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. ఈత కోసం కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు. వేసవికాలంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
W.G: కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన 5,056 టిడ్కో గృహాలను (తాడేపల్లిగూడెం 1,120, పాలకొల్లు 2,016, భీమవరం 1,920) మార్చి 30న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో పూర్తయిన మరో 259 గృహాలను అందజేస్తామన్నారు.
GNTR: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (HDS) సమావేశంలో వివిధ అంశాలను సమీక్షించారు. ఆసుపత్రిలోని ఎస్‌బీఐ శాఖను గల్లా జయదేవ్ బ్లాక్‌కు మార్చాలని నిర్ణయించారు.
KKD: కాకినాడ జిల్లాలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని JC అపూర్వ భరత్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నిల్వలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 8886903611కు ఫిర్యాదు చేయాలని సూచించారు. భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్లను మరింత పెంచుతామన్నారు.