• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

VZM: వాట్సాప్‌ కాల్‌ ద్వారా డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరుగుతున్న సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP ఎఆర్‌. దామోదర్‌ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు, CBI, ED అధికారులమంటూ వీడియో కాల్స్‌ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని, ఎవరైనా ఈ తరహా కాల్స్‌ చేస్తే వెంటనే 1930, 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.in&e వెబ్‌సైట్&zwnj...

March 27, 2026 / 06:30 AM IST

10 కిలోల గంజాయి స్వాధీనం.. ఓ వ్యక్తి అరెస్ట్

AKP: కశింకోట మండలం అచ్చెర్ల వద్ద గురువారం 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వస్తున్న పి.నూకరాజు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని బ్యాగ్ తనిఖీ చేశామన్నారు. అందులో 10 కిలోల గంజాయి, 14.95 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

March 27, 2026 / 06:29 AM IST

రోడ్డు ప్రమాదాలు నివారణకు జాయింట్ ఆపరేషన్

TPT: రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్, అగ్నిమాపక, ట్రాన్స్ పోర్ట్ సంబంధించిన అధికారులు జాయింట్ ఆపరేషన్ నిన్న నిర్వహించారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయులు ఆధ్వర్యంలో చెన్నై-తిరుపతి, తిరుపతి-విజయవాడ జాతీయ రహదారులపై ఉన్న ఏర్పేడు, వడమాల పేట టోల్ ప్లాజా ప్రాంతాల్లోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, సుదూర ప్రాంతాలకు పయనిస్తున్న వారి వాహనాలను తనిఖీ చేశారు.

March 27, 2026 / 06:28 AM IST

రేపు నుంచి బ్రహ్మోత్సవాలు

BPT: కొల్లూరు మండలంలోని చిలుమూరులోని గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి, రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు సహస్రాబ్ది స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపక ధర్మకర్త హరి దుర్గానాగేశ్వరరావు తెలిపారు. కాగా, ఈ రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.

March 27, 2026 / 06:27 AM IST

గుడ్లవల్లేరులో ముమ్మరంగా వ్యర్థాల తొలగింపు

కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను గురువారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.

March 27, 2026 / 06:27 AM IST

నేటి నుంచి రెవిన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు

SKLM: జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి క్రీడామైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి ఉద్యోగి పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీరాములు, బీవీవీఎన్ రాజులు కోరారు.

March 27, 2026 / 06:25 AM IST

విశాఖలో 2 రోజులు నీటి సరాఫరా బంద్

VSP: మహా విశాఖ నగరపాలక సంస్థ 77, 79, 85, 86, 88 వార్డుల పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఈనెల 28, 29 తేదీలలో (శని, ఆదివారాలు) నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఏఈ కేదార్నాథ్ తెలిపారు. అగనంపూడిలోని 85 ఎంఎల్‌డీ మంచినీటి శుద్ధి ప్లాంట్‌లో పరిశుభ్రత పనుల కారణంగా ఈ అంతరాయం కలగనుందన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలన్నారు.

March 27, 2026 / 06:24 AM IST

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన

PKSM: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ (KMC), డయాలసిస్ సెంటర్‌ను గురువారం రాత్రి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై ఆయనకు వివరించారు. ఆసుపత్రి సిబ్బందికి మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు.

March 27, 2026 / 06:21 AM IST

విశాఖపట్నం-చర్లపల్లి రైలు క్రమబద్ధీకరణ

ELR: విశాఖపట్నం-చర్లపల్లి రైలును క్రమబద్ధీకరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (18527) ఏప్రిల్ 3 నుంచి, చర్లపల్లి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18528) ఏప్రిల్ 4 నుంచి నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమహేంద్రవరం, ఏలూరు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో రైలు ఆగుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలి.

March 27, 2026 / 06:20 AM IST

మూలస్థానేశ్వర ఆలయ ఆదాయం ఎంతంటే..?

నెల్లూరులో మూలపేట మూలస్థానేశ్వర స్వామి ఆలయ హుండీల కానుకలను గురువారం లెక్కించారు. 104 రోజులకు స్వామి, అమ్మవార్ల హుండీల ద్వారా రూ. 8,94,815 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఛైర్మన్ భ్రాజకుమార్, ఈవో వెంకట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించి, ఆలయ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

March 27, 2026 / 06:20 AM IST

రేపటి దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

GNTR: కలెక్టరేట్‌లో వివిధ ప్రతిభావంతుల సమస్యలను తెలుసుకొనుటకు రేపు నిర్వహించాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ ఎస్‌.వెంకటరమణప్ప తెలిపారు. పలు కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు సహకరించాలని ఆయన కోరారు.

March 27, 2026 / 06:20 AM IST

ఈ నెల 27న ‘మీ వద్దకే భవిష్యనిధి’ కార్యక్రమం

VSP: భవిష్యనిధి ఖాతాదారులు, పెన్షనర్లు, పీఎఫ్ సంస్థల యజమానుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27వ తేదీన “మీ వద్దకే భవిష్యనిధి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సహాయ పీఎఫ్ కమిషనర్-2 నితీష్ కుమార్ తెలిపారు. విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, నాగ హనుమాన్ ఫిష్ ప్యాకర్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

March 27, 2026 / 06:19 AM IST

జిల్లాలో పోలీసుల తనిఖీలు

CTR: జిల్లా వ్యాప్తంగా పలు లాడ్జీలు, డాబాలను పోలీసులు నిన్న రాత్రి తనిఖీ చేశారు. లాడ్జిలలో గుర్తింపు కార్డులు, అతిథుల వివరాల నమోదు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను ఆరా తీశారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై సూచనలు ఇచ్చారు. డాబాలు, లాడ్జిలలో అక్రమ కార్యకలాపాలకు చోటు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

March 27, 2026 / 06:18 AM IST

డ్రోన్ ఆపరేషన్.. నాటుసారా కేంద్రాలు ధ్వంసం

KRNL: కర్నూలు జిల్లా ఆదోని రూరల్ సీఐ నల్లప్ప, ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలో పోలీసులు గురువారం డ్రోన్ సాయంతో ఇస్వీ కొండలలోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,000 లీటర్ల నాటుసారా తయారీకి ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉదయ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

March 27, 2026 / 06:15 AM IST

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కంకణధారణ వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు.

March 27, 2026 / 06:15 AM IST