కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా చెత్త తొలగింపు పనులను గురువారం చేపట్టారు. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బండికి అందజేయాలని ఆయన గ్రామస్థులకు సూచించారు.