• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే

కృష్ణా: విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 7లక్షలు వ్యయంతో బడేవారిపాలెం జడ్పీ హైస్కూల్, ఉల్లిపాలెం జడ్పీ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్లను ప్రారంభించారు.

February 28, 2026 / 07:06 PM IST

కష్టాల్లో టీడీపీ తోడుంటుంది: ఎమ్మెల్యే

E.G: గోపాలపురం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన TDP కార్యకర్త పోలిన ఆంజనేయులు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల బీమా చెక్కును MLA మద్దిపాటి వెంకట రాజు శనివారం అందజేశారు. ప్రతి TDP కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.

February 28, 2026 / 07:02 PM IST

గుమ్మలక్ష్మీపురంలో బోర్ల మరమ్మత్తులు పూర్తి

PPM: గుమ్మలక్ష్మీపురం గ్రామపంచాయతీలో వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ‘క్రాస్ ప్రోగ్రాం’ కింద ఆరు బోర్లను మరమ్మత్తు చేశారు. రజక వీధి, చింతలగూడ వీధి, అంగన్వాడి కేంద్రం, గడ్డి కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు ప్రాంతం, స్మశానం ప్రాంతాల్లో పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.

February 28, 2026 / 07:02 PM IST

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

VZM: ద్వారపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆల్తి నర్సింహులు ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

February 28, 2026 / 07:00 PM IST

ఎమ్మెల్యే రవికుమార్ రేపటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ ఆదివారం ఉదయం 9.30కు కొత్త రోడ్డు దగ్గర S.S ఎలక్ట్రానిక్స్ హోల్ సేల్ మాల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 10కు ఆమదాలవలస B.R నగర్‌లో ఉన్న పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 కు ఆమదాలవలస మున్సిపల్ ఆఫీస్‌లో క్రొత్తగా మంజూరైన స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 28, 2026 / 07:00 PM IST

‘దళితులపై దాడులు ఆపాలి’

KRNL: జిల్లాలో దళితులపై దాడులు తీవ్రతరం అయ్యాయని BSS రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ ఇవాళ అన్నారు. ప్రశ్నించే గొంతును అణిచే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. SC, ST అఘాయిత్యాల నిరోధక చట్టం 1989 కింద నమోదైన కేసుల్లో వేగవంతమైన విచారణ కోసం కర్నూలులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:59 PM IST

జిల్లాలో 124 మంది పరీక్షకు గైర్హాజరు

కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.

February 28, 2026 / 06:59 PM IST

గుంటూరులో పోలీస్ అధికారుల ఘన వీడ్కోలు

గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ హనుమంతు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐలు ఖాదర్ బాషా, మొహమ్మద్ సలాహుద్దీన్‌లను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

February 28, 2026 / 06:58 PM IST

‘కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం’

CTR: కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం శనివారం నిర్వహించారు. కాణిపాకం పట్నం వద్ద రహదారి నిర్మాణానికి 18 ఎకరాల భూమిని కేటాయించేలా కేబినెట్‌లో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గోశాల నిర్వహణకు నూతన భూమి కొనుగోలుకు, రానున్న ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చులు, దేశంలో భక్తుల సౌకర్యాలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఛైర్మన్ మనినాయుడు ఉన్నారు.

February 28, 2026 / 06:55 PM IST

కాకుమాను నూతన ఎస్సైని అభినందించిన ఎస్పీ

GNTR: కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బత్తుల హరికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైని ఎస్పీ అభినందించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.

February 28, 2026 / 06:55 PM IST

శ్రీమాతంగిశ్వరస్వామి సేవలో శంకర్ రెడ్డి

TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీమాతంగిశ్వరస్వామి ఆలయాన్ని టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం దాత కృష్ణయ్య యాదవ్ రూ.50 వేల చెక్కును శంకర్ రెడ్డి చేతుల మీదుగా అర్చకులకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:54 PM IST

పొన్నూరులో నోడల్ అధికారుల నియామకం

GNTR: స్వచ్ఛ సర్వేక్షణ 2025-26లో భాగంగా పొన్నూరు మున్సిపాలిటీలో 31 వార్డులకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించారు. పట్టణానికి ఉన్నత ర్యాంకు సాధించడమే లక్ష్యంగా శనివారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకుంటూ వార్డుల్లో పరిశుభ్రత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

February 28, 2026 / 06:53 PM IST

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

NTR: విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కృష్ణానదిలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగినవాడిగా, ఒంటిపై బనియన్ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 06:53 PM IST

యర్రగొండపాలెంలో పెద్దపులి సంచారం

ప్రకాశం: యర్రగొండపాలెం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన పొలాలకు సమీపంలోని నీటికుంట వద్దకు పెద్దపులి వస్తుందని స్థానికులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించిన రైతులు, పొలాలకు వెళ్ళేందుకు ప్రాణభయంతో హడలి పోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 06:52 PM IST

‘వేగం కన్నా ప్రాణం మిన్న’

NDL: బేతంచెర్ల(మం) వేగం కన్న ప్రాణం ముఖ్యమని బేతంచెర్ల సీఐ డీ. వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు అన్నారు. శనివారం బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో ఆటోడ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 28, 2026 / 06:52 PM IST