• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విజయనగరం RDOగా నియామకం

VZM: జిల్లా RDOగా విశాఖలోని HPCL స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌‌గా పనిచేస్తున్న సనపాల సుధాసాగర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల గ్రూప్‌ పరీక్షల్లో అవకతవలు జరిగాయంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలైన నేపథ్యంలో.. ఆ బ్యాచ్‌ అధికారులందరినీ బదిలీ చేయాలన్న న్యాయస్థానం తీర్పు మేరకు ప్రస్తుత RDO దాట్ల కీర్తీని బదిలీ చేసిన విషయం తెలిసినదే.

March 18, 2026 / 06:38 AM IST

జిల్లాలోని మామిడి రైతులకు గమనిక

NLR: ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని మామిడి తోటల రైతులు నల్ల తామర, తేనె మంచు వంటి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను ఎదుర్కొనే అంశంపై ఉద్యానశాఖ కందుకూరులో మామిడి రైతులకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహిస్తోంది. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు జరిగే సదస్సులో శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు చేస్తారని రైతులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 18, 2026 / 06:37 AM IST

కేజీహెచ్‌లో నూతన నర్సింగ్ యూనిట్ ప్రారంభం

VSP: నోయిడా లేడీస్ సర్కిల్ 210 ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ ఆయుష్మాన్’ కింద విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో పిల్లల విభాగంలో నూతన నర్సింగ్ యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను అభిజ్ఞ గ్రాంధి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. ఐ.వాణి మాట్లాడుతూ.. మాతా-శిశు సంరక్షణ సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 18, 2026 / 06:36 AM IST

‘రెవెన్యూ దస్త్రాల డిజిటలేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

SKLM: రెవెన్యూ దస్త్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.

March 18, 2026 / 06:35 AM IST

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే

గుంటూరు: ఆర్టీసీ బస్టాండ్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తూర్పు ఎమ్మెల్యే నసీర్ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. దివ్యాంగుల సహాయకులకు 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు సదరం, ధ్రువపత్రాల కాపీ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

March 18, 2026 / 06:33 AM IST

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

ASR: కొయ్యూరు మండలంలోని గరిమండ గ్రామంలో మంగళవారం రాత్రి మంప ఎస్సై సీదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గంజాయి సాగు, రవాణా నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు.

March 18, 2026 / 06:32 AM IST

మార్కాపురంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ప్రకాశం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పుల్లలచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కాపురం DSP నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు దొంగిలించిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 18, 2026 / 06:31 AM IST

నవోదయ ఫలితాల్లో ప్రత్తిపాడు విద్యార్థుల ప్రతిభ

కాకినాడ: నవోదయ విద్యాలయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రత్తిపాడు మండలం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వొమ్మంగి శ్రీ భారతి విద్యాసంస్థకు చెందిన కాశీ బెహన్ మోహెల్ (ఎటపాక), చేవల కృపామయి, ముమ్మిడి పవన్ (పెద్దాపురం) నవోదయాలకు ఎంపికయ్యారు. అలాగే అఖిల్ స్కూల్ విద్యార్థి చేవల ప్రమోద్ పెద్దాపురం నవోదయకు ఎంపికైనట్లు పాఠశాలల నిర్వాహకులు తెలిపారు.

March 18, 2026 / 06:31 AM IST

పీలేరులో గర్భిణీ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: పీలేరులోని వెంకటాద్రి ఇండ్ల ప్రాంతంలో జయశ్రీ (21) అనే గర్భిణీ మహిళ కట్నం వేధింపులు, భర్త అనుమానంతో తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇంట్లోనే విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

March 18, 2026 / 06:25 AM IST

రోడ్డు భద్రత గురించి వాహనదారులు అవగాహన

కృష్ణా: పామర్రులోని ఫ్లై ఓవర్ వద్ద ఎస్సై విజయ భాస్కర్ రోడ్డు భద్రత గురించి వాహనదారులకు మంగళవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

March 18, 2026 / 06:24 AM IST

రోడ్డు భద్రత గురించి వాహనదారులకు అవగాహన

కృష్ణా: పామర్రులోని ఫ్లై ఓవర్ వద్ద ఎస్సై విజయ భాస్కర్ రోడ్డు భద్రత గురించి వాహనదారులకు మంగళవారం అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

March 18, 2026 / 06:24 AM IST

రేపు సింహాద్రి అప్పన్న సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు

VSP: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు సింహా చలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పాల్గొనాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 18, 2026 / 06:20 AM IST

లింగాలలో టిప్పర్ కింద పడి డ్రైవర్ మృతి

KDP: లింగాల మండలం బోనాల గ్రామంలో మంగళవారం సాయంత్రం టిప్పర్ కిందపడి దస్తగిరి అనే డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బోనాల నుంచి పొలాలకు మట్టి లోడ్ చేస్తుండగా, మరో టిప్పర్ వెనుకవైపు నుంచి దస్తగిరిపైకి దూసుకురావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దస్తగిరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

March 18, 2026 / 06:18 AM IST

క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

PPM: రేపటి నుంచి జియ్యమ్మవలస మండలం రామభద్రాపురం గిరిజన సంక్షేమ పాఠశాల మైదానంలో క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చేతులమీదుగా క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తి గల క్రీడాకారులు తమ కార్యాలయాన్ని సంప్రదించి టీం పేర్లు నమోదు చేసుకోవల్సిందిగా నిర్వాహకులు కోరారు.

March 18, 2026 / 06:16 AM IST

జాతర్ల నేపథ్యంలో అల్లరి మూకలు అరెస్టు

తూ.గో: మాతృశ్రీ నూకాలమ్మ జాతర సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కొత్తపల్లి, రామరాజుపేట గ్రామాలకు చెందిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కోరుకొండ సీఐ మూర్తి మంగళవారం తెలిపారు. జాతరలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ అరెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.

March 18, 2026 / 06:11 AM IST