• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మౌలిక సదుపాయాలపై ఆరా..

VSP: చింతల్లోవ, కాకరలోవ, జయేంద్ర కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జీవీఎంసీ జోనల్ కమిషనర్ హేమవతి పరిశీలించారు. కార్పొరేటర్ గల్లా చిన్నతో కలిసి మౌలిక సదుపాయాల గురించి స్థానికులతో మాట్లాడారు. పనుల పురోగతిని సమీక్షించారు. సచివాలయ, శానిటేషన్ సిబ్బంది ఆమె వెంట ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు.

March 17, 2026 / 01:46 PM IST

ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తి

AKP: కోటవురట్ల మండలంలో ఈ నెలాఖరు నాటికి 5.73 లక్షల పని దినాలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఉపాధి హామీ పథకం ఏపీవో నాగరాజు మంగళవారం తెలిపారు. ఇప్పటివరకు 5.53 లక్షల పని దినాలను పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరులోగా 20వేల పని దినాలను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 01:43 PM IST

హంద్రీనీవా ద్వారా పెద్ద చెరువుకు చేరుతున్న కృష్ణా జలాలు

CTR: పుంగనూరు (M) మోదుగులపల్లి పెద్ద చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణ జనాలను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలతో కలిసి కృష్ణా జలాలకు పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ చెరువు ఆయకట్టు కింద అనుకుని ఉన్న భూమి రైతులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:36 PM IST

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

E.G: తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో రైతన్నా-మీకోసం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఉందని, తద్వారా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 17, 2026 / 01:33 PM IST

రేణిగుంటలో మోసం చేసి దోపిడీ

TPT: రేణిగుంటలో ఆలయానికి తీసుకెళ్తామని నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసి దోపిడీ చేసిన ఘటన బయటపడింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్న ఇద్దరు, అతన్ని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బైక్, మొబైల్, నగదు, వెండి గొలుసు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 17, 2026 / 01:33 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి..!

KDP: బద్వేల్ మండల పరిధిలోని లక్ష్మీపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. బస్సు ఆపి ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేయడంతో ముక్కులో నుంచి రక్తం వస్తున్న డ్రైవర్‌ను వదలలేదని స్థానికులు తెలిపారు. అయితే దాడి నిన్న జరిగిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్ తెలిపాడు.

March 17, 2026 / 01:29 PM IST

సజ్జల నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో సజ్జలు నూర్పిడి పట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు దొడ్డనగేరి గ్రామానికి చెందిన వ్యక్తి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. యంత్రంలో చిక్కుకోవడంతో మృతుడి శరీరం గుర్తుపట్టలేనంతగా చిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 17, 2026 / 01:29 PM IST

సీసీ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం బస్టాండ్‌లో రూ. 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.

March 17, 2026 / 01:27 PM IST

‘టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించాలి’

W.G. భీమవరంలో మంగళవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు.

March 17, 2026 / 01:26 PM IST

మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

బొబ్బిలి పట్టణ సీఐ కె. నారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, మత్తు పానీయాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చదువుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలు వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

March 17, 2026 / 01:23 PM IST

‘ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం’

ELR: దెందులూరు నియోజకవర్గం లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 01:23 PM IST

మంత్రి బీసీ పర్యటన వివరాలు..!

NDL: రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ బనగానపల్లె మండలంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దరాజుపాలెం, చెర్లకొత్తూరు గ్రామాల్లో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.

March 17, 2026 / 01:22 PM IST

‘బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలి’

తూ.గో: నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ నేతృత్వంలో మంగళవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

March 17, 2026 / 01:22 PM IST