W.G: పాలకొల్లులో మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇతర కులస్థులు, కార్పొరేట్ సంస్థలు క్షవర వృత్తిలోకి రావడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని జిల్లా అధ్యక్షుడు ఉప్పలపు దుర్గా పెద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు.