BPT: సంతమాగులూరు మండలంలోని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సైదా పాల్గొని రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.