• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలి’

తూ.గో: నిడదవోలు రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు చింతల బాలాజీ నేతృత్వంలో మంగళవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్-2026 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై ప్రశిక్షణ ప్రాధాన్యతను వివరించారు. బీజేపీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

March 17, 2026 / 01:22 PM IST

రాష్ట్రస్థాయిలో తెనాలి కళాకారుల ప్రతిభ

GNTR: ప్రభుత్వం ఉగాది పర్వదినాన అందజేసే ప్రతిష్ఠాత్మక ‘కళారత్న’, ఉగాది పురస్కారాల మొమెంటోలను తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అద్భుతంగా రూపొందించారు. ఈ మొమెంటోలను సీఎం చంద్రబాబు గ్రహీతలకు అందజేయనున్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో వీటిని సందర్శించిన తహసీల్దార్ గోపాలకృష్ణ, తెనాలి కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

March 17, 2026 / 01:15 PM IST

ప్రొద్దుటూరు కౌన్సెలింగ్ లాస్ట్ మీటింగులోనూ రభసేనా..!

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లాస్ట్ మీటింగులోనూ రభస తప్పలేదు. మంగళవారం ఛైర్ పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. తాను సూచించిన ప్రాధాన్యత కలిగిన అంశాలను అజెండాలోకి తీసుకురాక పోవడంపై ఛైర్ పర్సన్ కమిషనర్‌ను నిలదీశారు. టేబుల్ అజెండాగా తేవాలని సమావేశాన్ని అరగంట వాయిదా వేశారు.

March 17, 2026 / 01:13 PM IST

పెట్టుబడి సాయం అందజేత..!

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన రైతులకు పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సమకూరిన లబ్ధిపై రైతులకు మంగళవారం టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ నరసప్ప, సీఈవో నరసింహామూర్తి, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 20 వేలు ఇచ్చిందన్నారు.

March 17, 2026 / 01:11 PM IST

ముదిగేడులో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం

NDL: సంజామల మండలం ముదిగేడులో మంగళవారం వ్యవసాయ సహాయకురాలు సుమ పరిమళ, ఎంపీఈఓ వేణు గోపాల్ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు విధానాలపై, వ్యవసాయాభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్, టీడీపీ నేత రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

March 17, 2026 / 01:08 PM IST

ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే రాజప్ప ఆకస్మికంగా తనిఖీ

కాకినాడ: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలోని ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.

March 17, 2026 / 01:05 PM IST

అమీన్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఛైర్‌పర్సన్

ATP: కడపలోని పవిత్ర అమీన్ పీర్ దర్గాను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సందర్శించారు. మంగళవారం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో తాను కోరుకున్న మొక్కుబడి నెరవేరిన సందర్భంగా సంప్రదాయం ప్రకారం భక్తులకు చక్కెర పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కడప దర్గా విశిష్టతను కొనియాడారు.

March 17, 2026 / 01:03 PM IST

మంత్రితో చింతలపూడి ఎమ్మెల్యే భేటీ

ELR: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు జిల్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహించనున్నారని అన్నారు.

నేటితో ముగిసిన కౌన్సిలర్ల పదవీకాలం

ప్రకాశం: మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ల 5 ఏళ్ల పదవి కాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని వారు కలిసి సన్మానించారు. కౌన్సిలర్లుగా తమకు అవకాశం కల్పించినందుకు కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, చాతరాజుపల్లి అంజమ్మ శ్రీనివాసులు, ఇతర కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు ఉన్నారు.

March 17, 2026 / 01:02 PM IST

‘శెనగ రైతులకు ఇవ్వాల్సింది కొండంత.. ఇచ్చింది గోరంత’

KDP: జిల్లాలో బుడ్డ శెనగల రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సింది కొండంత, ఇప్పటివరకు ఇచ్చింది గోరంత అని కాంగ్రెస్ తులసి రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. గత ఫిబ్రవరి నెల 19వ తేదీ జిల్లాలో 21 బుడ్డ శెనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. క్వింటాలుకు రూ. 5,875 చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారన్నారు.

March 17, 2026 / 01:02 PM IST

తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టండి : చైర్మన్

CTR: వేసవి సమీపిస్తున్న దృశ్య పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంతకాలం తమ పాలక వర్గానికి సహకారం అధికారులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:02 PM IST

తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టండి: ఛైర్మన్

CTR: వేసవి సమీపిస్తున్న దృశ్య పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష అధికారులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం పుంగనూరు పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంతకాలం తమ పాలక వర్గానికి సహకారం అధికారులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 01:02 PM IST

‘పన్నుల చెల్లింపులో 50% వడ్డీ రాయితీ’

ATP: గుత్తి మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.

March 17, 2026 / 01:01 PM IST