ATP: గుత్తి మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.