CTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ విజయానంద రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. ఆయన రాసలీలలు బయటపడిన అనంతరం కూడా పదవిలో కొనసాగించడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం అందించారు.
ప్రకాశం: ఇండియన్ నేషనల్ టాలెంట్ చర్చ్ ఒలింపియాడ్ లెవెల్-2లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు మంత్రి స్వామి మంగళవారం బహుమతులు అందించారు. ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షల్లో సింగరాయకొండ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వీరికితన క్యాంపు కార్యాలయం తూర్పునాయుడుపాలెంలో బహుమతులు అందజేశారు.
SKLM: సోంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ ఇవాళ ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలుపుతూ.. 12 పరిశ్రమలకు సంబంధించి 365 ఉద్యోగాలకు జాబ్ మేళా చేపడుతున్నామన్నారు. ఈనెల 24న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: భక్తుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి అరుణాచలం, రామేశ్వరం పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్. కుమార్ తెలిపారు. ఈ ఎనిమిది రోజుల యాత్రకు సంబంధించిన బస్సు ఈనెల 20 మధ్యాహ్నం రావులపాలెం నుంచి బయలుదేరుతుందని వివరించారు. ఈ ప్రయాణానికి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో రేపు బుధవారం హుండీ లెక్కింపు జరుగుతుందని ఈవో బైరాగి చౌదరి తెలిపారు. దేవస్థాన ఛైర్మన్ పోటు పెదబాబు, దేవాదాయ అధికారులు, గ్రామస్థుల సమక్షంలో ఈ లెక్కింపు జరుగుతుందన్నారు. భక్తులు ఈ లెక్కింపు కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
TPT: పుత్తూరు పట్టణoలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో నిర్వహించిన శుభ వివాహ మహోత్సవంలో మాజీ మంత్రి రోజా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున నూతనంగా నిర్మించిన 47 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

GNTR: పొన్నూరు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మంగళవారం కమిషనర్ రమేశ్ బాబు తెలిపారు. ఈ ప్రయోజనం పొందాలంటే అసలు పన్నుతో పాటు మిగిలిన సగం వడ్డీని మార్చి 31వ తేదీలోపు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తాజ్ బ్రాండ్‌తో రూ.104 కోట్ల పెట్టుబడితో 3.4 ఎకరాల్లో హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. సర్వే పూర్తై, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరిన్ని సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. దీంతో జిలాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది.

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సైతారుపేట జంక్షన్ వద్ద మురికి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. జేసీబీతో చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాలువలో చెత్త వేయడంతో మురుగునీరు సరిగా సరఫరా కావడం లేదు. కాలువ సమీపంలో గల పెంజెరువులో కూడా పూడిక తీయనున్నట్లు సానిటరీ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.

KDP: మైలవరం MRO లక్ష్మీనారాయణను బదిలీ నిమిత్తం కడప కలెక్టరేట్లో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మైలవరం తాత్కాలిక MROగా ఓతూరు షఫీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ముద్దునూరు MLS పాయింట్లలో డిప్యూటీ ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తూ.. త్వరలోనే మైలవరంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
నెల్లూరు: జిల్లా న్యాయాధికారికి సర్వేపల్లి MLA సోమిరెడ్డి వినతి పత్రం అందజేశారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి తప్పుడు పత్రాలు సృష్టించి అప్రతిష్ట పాలు చేశాడని, 2016లో కేసు పెట్టగా 2019లో చార్జిషీట్ వేశారని అన్నారు. అప్పటి నుంచి కేసు ముందుకు సాగలేదని, కేసును త్వరితగతిన పరిష్కరించాలని న్యాయాధికారి నాలుగవ అదనపు జ్యుడీషియల్ న్యాయాధికారిని కోరారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం ఉచ్చిలిలో రైతన్న మీకోసం కార్యక్రమం టీడీపీ శ్రేణులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బండారు సంజీవ్ పాల్గొన్నారు. రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్న మీకోసం పాంప్లెట్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఖాతాలో రూ.20,000 జమ చేసినట్లు పేర్కొన్నారు.