SKLM: సోంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ ఇవాళ ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన తెలుపుతూ.. 12 పరిశ్రమలకు సంబంధించి 365 ఉద్యోగాలకు జాబ్ మేళా చేపడుతున్నామన్నారు. ఈనెల 24న ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.