• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం’

BPT: దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ సౌకర్యం వర్తిస్తుందనన్నారు.

March 17, 2026 / 07:15 PM IST

ఎమ్మెల్యేను కలిసిన ఏపీ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్

VZM: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు ఈరోజు విజయనగరం విచ్చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గం పరిధిలో హోసింగ్‌కు సంబందించిన సమస్యలపై చర్చించారు.

March 17, 2026 / 07:14 PM IST

కల్తీ ఆహారంపై అవగాహన కార్యక్రమం

VZM: బొబ్బిలిలో ఆహార భద్రత నియంత్రణాధికారి ఎస్. ఈశ్వరి ఆధ్వర్యంలో టోకు, చిల్లర వ్యాపారులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా FSSAI చట్టం, ఆహార కల్తీ ప్రమాదాలు, అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధులపై వివరించారు. బెల్లంలో కృత్రిమ రంగుల వల్ల నష్టాలపై అధికారి పి. వెంకట రమణ అవగాహన కల్పించారు.

March 17, 2026 / 07:13 PM IST

‘సహకార సంఘాలు బలోపేతం చేయాలి’

ASR: సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శక పాలనకు సహకార చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం పాడేరు కో ఆపరేటివ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ, రైతులకు, సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహకార సంఘాల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

March 17, 2026 / 07:12 PM IST

నర్సీపట్నంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు

AKP: నర్సీపట్నంలో శ్రీ నూకాలమ్మ జాతరను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం టౌన్ సీఐ షేక్ గఫూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి గరగలు, స్టేజ్ ప్రోగ్రాములు జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూకాలమ్మ ఆలయం వద్ద మహిళా భక్తుల భద్రత మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

March 17, 2026 / 07:12 PM IST

జోరుగా అక్రమంగా మద్యం అమ్మకాలు

KKD: పెద్దాపురం(మం) కాండ్రకోట నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతరలో జోరుగా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్న ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతో కొంతమంది అధిక ధరకు మధ్యం అమ్ముతున్నాని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహానికి గురవుతున్నారు.

March 17, 2026 / 07:10 PM IST

పంటల మెలుకువులపై అవగాహన

CTR: పుంగనూరు MPDO కార్యాలయంలో మామిడి, టమాటా పంటలపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. మదనపల్లె ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త దత్తా రెడ్డి మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తామర పురుగు నివారణకు వేప నూనె 1ml లేదా ట్రేసర మందు 0.3 ml ఒక లీటర్ నీటికి, తేనె మంచు పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై తెలిపారు.

March 17, 2026 / 07:03 PM IST

‘సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి’

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలకు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయడం లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

March 17, 2026 / 07:00 PM IST

మంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే

E.G: విజయవాడలో మంత్రి లోకేష్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లిరామకృష్ణారెడ్డి మంగళవారం మర్యాదపూర్వ కలిశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత వెంకటరెడ్డి దంపతులు కుమారుడు జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెడ్డి కుమార్తె సనాతని వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు. వచ్చే నెల ఏప్రిల్ 2న హైదరాబాద్ JRC కన్వెన్షన్‌లో జరిగే వివాహానికి హాజరవ్వాలని కోరారు.

March 17, 2026 / 07:00 PM IST

ఆళ్లగడ్డ మహిళా శిల్పికి కలెక్టర్ పిలుపు

NDL: ఆళ్లగడ్డలోని ప్రముఖ శిల్పి దురగడ్డ రవీంద్రా ఆచారి కుమార్తె భువనేశ్వరిని కలెక్టర్ రాజకుమారిగణియ ఆహ్వానించారు. మంగళవారం శిల్పి భువనేశ్వరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధర్మచక్రం విగ్రహం కావాలని కలెక్టర్ ఆడిగినట్లు ఆమె తెలిపారు. తాను తయారు చేసిన చిన్న శివలింగాన్ని శిల్పి భువనేశ్వరి కలెక్టర్‌కు బహుకరించారు.

March 17, 2026 / 07:00 PM IST

ఉపాధి నిధులతోనే గ్రామాల అభివృద్ధి: MPDO

ELR: ఉపాధి హామీ నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. మండలంలో ఉపాధి కూలీలతో రూ.కోటితో పనులు చేశామని ఏపీవో వెంకటరమణ, ఎంపీడీవో మనోజ్‌కు వివరించారు . ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

March 17, 2026 / 07:00 PM IST

రాజంపేటలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ తనిఖీ

KDP: రాజంపేటలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్‌ను సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన పరిశీలించారు. గ్యాస్ సరఫరా, నిల్వ పరిస్థితులు, భద్రతా చర్యలను సమీక్షించారు.హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంలోకి వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ పీర్ మున్ని పాల్గొన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా కొనసాగించాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 07:00 PM IST

రాజంపేటలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ తనిఖీ

KDP: రాజంపేటలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్‌ను సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన పరిశీలించారు. గ్యాస్ సరఫరా, నిల్వ పరిస్థితులు, భద్రతా చర్యలను సమీక్షించారు.హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంలోకి వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో తహసీల్దార్ పీర్ మున్ని పాల్గొన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా కొనసాగించాలని అధికారులకు సూచించారు.

March 17, 2026 / 07:00 PM IST

అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మ దహనం

KRNL: రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన వ్యక్తంచేశారు. యూనివర్సిటీలో ఓ అధికారి బకాసురుడిలా మారి నిధులను అడ్డగోలుగా దోచుకుంటున్నాడని ఆరోపణలు చేశారు.

March 17, 2026 / 07:00 PM IST

రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలి: కలెక్టర్

ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు ఖచ్చితంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 17, 2026 / 06:59 PM IST