VSP: నోయిడా లేడీస్ సర్కిల్ 210 ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్ ఆయుష్మాన్’ కింద విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో పిల్లల విభాగంలో నూతన నర్సింగ్ యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను అభిజ్ఞ గ్రాంధి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. ఐ.వాణి మాట్లాడుతూ.. మాతా-శిశు సంరక్షణ సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.