PLD: మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని నివాసంలో పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంత్రితో చర్చించారు. కాగా, కొమ్మాలపాటి వరుసగా పెదకూరపాడు నియోజకవర్గం టికెట్ ఆశించినా రాకపోవడంతోపాటు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పదవి కూడా పోవడంతో ఆయన సన్నిహితులు నిరాశలో ఉన్నారు.
ప్రకాశం: పొదిలి మండలం కంభాలపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద సాగర్ పైప్ లీకైంది. స్కూల్ గేటు వద్ద నీరు చేరి బురదమయంగా మారింది. బురదలో నుంచి విద్యార్థులు,టీచర్లు వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని విద్యార్థులు, టీచర్లు కోరుతున్నారు.
కాకినాడ: శంఖవరం మండలం శృంగధార జలపాతం పైన పెద్దపులి ఉందని అధికారులు వెల్లడించారు. కావున శృంగధార , పెదమల్లాపురం, ,బురదకోట, కె మిర్తివాడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భారీగా అటవీ శాఖ సిబ్బంది పులిని బంధించడానికి మోహరించారు. ఇక హనుమాన్ బృందాలు, ట్రాంక్విలైజింగ్ టీమ్స్ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది.
E.G: రాజమండ్రిలోని RTC కాంప్లెక్స్ వద్ద ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన ఇంఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు.
VZM: గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివ్యాంగశక్తి పథకాన్ని ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు ఇవాళ ప్రారంభించారు. అంగవైకల్యం 40% పైబడిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి వీటి రామారావు, ఎంపీడీవో కళ్యాణి ఆర్టిసీ అధికారి నాయుడు, టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, ప్రదీప్ కుమార్, మక్కువ శ్రీధర్, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
AKP: గుంటూరులో ఈనెల 26 నుంచి ఏప్రిల్ 7వరకు జరిగే ఆర్చరీ మినీ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్ధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి ఇవాళ తెలిపారు. పాఠశాల నుంచి అండర్ 15 విభాగంలో లలిత్ సాయి తేజ, అండర్ 13 విభాగం నుంచి కేత్విన్ హర్షా, ఏ రవికాంత్‌లు హాజరవుతున్నట్లు కోచ్ సూరిబాబు పేర్కొన్నారు.
VSP: వైసీపీ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలిగా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
PPM: వీరఘట్టం మండలం పెద్దూరు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కాలం కావడంతో భవనం శ్లాబు పెచ్చులు ఊడి పోయింది. దీంతో ప్రమాదం ఉన్నచోటే చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ 25 మంది చిన్నారులు చదువుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వానా కాలంలో వర్షపు నీరు కారుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
సత్యసాయి: కొత్తచెరువు మండలం పోతులకుంట, మరువకుంటపల్లి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు.
ATP: అనంతపురం అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సాయం, హజ్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ELR: ఉంగుటూరు (M) కైకరం సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో భక్తులు సమకూర్చిన రూ. 5 లక్షలపైగా విరాళాలతో రూపొందించిన ఆష్ట భుజి టేకు రథం ఈనెల 21న సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయ కర్త కూన అప్పారావు బుధవారం తెలిపారు. కర్ణాటకలోని కుంట పట్నానికి చెందిన కుంట హస్త కళా సంస్థ ఈ దివ్య రథ నిర్మాణం చేశారని పేర్కొన్నారు.
CTR: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఇవాళ వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. కంభం వారి పల్లి పంచాయతీ గాండ్ల పల్లెకు చెందిన మోహన్ బాబు (26) వ్యవసాయ పొలాల వద్ద మోటర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం బావిలోపడ్డాడు. ఇవాళ అతని మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికి తీశారు.
W.G: ఆకివీడు పెదపేట గుడి వివాదంలో రాజకీయ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించకూడదని CPM ఏరియా కమిటీ కోరింది. ఇరు వర్గాలను సమన్వయ పరుస్తూ మతసామరస్యం పెంపొందించాలని బుధవారం ఏరియా కార్యదర్శి కె. తవిటి నాయుడు సూచించారు. వివాద పరిష్కారానికి శాంతి కమిటీ వేయాలని, ఎవరూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రయత్నించవద్దని కోరారు.
SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇవాళ నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు .