• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి ఇంటా సిరి సంతోషాలు వెల్లివిరియాలి’

VZM: తెలుగు వారి కొత్త సంవత్సరాధి ‘శ్రీ పరాభవ నామం’లో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మాదిరి జీవితంలోని కష్టసుఖాల సమ్మేళనానికి ప్రతీకలని, ప్రజలందరూ ధైర్యంతో, ఉత్సాహంతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

March 18, 2026 / 11:29 AM IST

పశు వైద్యశాల.. సమస్యల గోల..!

KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలోని పశు వైద్యశాలలో సమస్యలు వేధిస్తున్నాయి. ఈ ఆసుపత్రి ఇరుకుగా ఉండటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి, మంచినీరు వంటి కనీస సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని, ఆసుపత్రికి వచ్చే పాడి రైతులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

March 18, 2026 / 11:29 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షలు.. 333 మంది గైర్హాజరు

TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 24,332 మంది విద్యార్థులకు గాను 23,999 మంది విద్యార్థులు హాజరైనట్లు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అధికారులు తెలియజేశారు.

March 18, 2026 / 11:29 AM IST

విశ్రాంత జాయింట్ కలెక్టర్ కన్నుమూత

KRNL: కర్నూలు జిల్లా విశ్రాంత జాయింట్ కలెక్టర్-2 ఎస్. రామస్వామి బుధవారం మృతి చెందారు. 2022లో పదవీ విరమణ పొందిన ఆయన, గతంలో జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రామస్వామి మృతికి జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. పరిపాలనలో ఆయన అందించిన విశేష సేవలను పలువురు కొనియాడారు.

March 18, 2026 / 11:27 AM IST

శ్మశానంలో పేకాట శిబిరం.. ఇద్దరు అరెస్ట్

కోనసీమ: అమలాపురం మండలం మున్సిపల్ కాలనీ వెనుక ఉన్న శ్మశానంలో పేకాట శిబిరంపై పట్టణ ఎస్సై NR కిషోర్ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కాలాడి వెంకటేశ్, తాళ్ల భగవాన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

March 18, 2026 / 11:26 AM IST

నేడే ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం

అన్నమయ్య: మదనపల్లె- బెంగళూరు జాతీయ రహదారిలో మడికయ్యల శివాలయం వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఇవాళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రారంభించనున్నారు. డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 18, 2026 / 11:26 AM IST

ఒకేసారి ఎన్నికల కోసం కసరత్తు

CTR: మూడు జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్తుల ఏర్పాటు పని ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్తగా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేసేలా రాష్ట్రస్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో జడ్పీ పదవీకాలం ముగియనుండటంతో, ఆలోపు విభజించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

March 18, 2026 / 11:22 AM IST

అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

VSP: మారికవలస కాలనీలోని 1 నుంచి 10 బ్లాకుల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరుతుండటంతో, తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు తెలిపారు. ఈ కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 11:21 AM IST

తుప్పు పడుతున్న ప్రభుత్వసొమ్ము

NTR: పెనుగంచిప్రోలులోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆస్తులు నిట్టనిలువునా తుప్పు పట్టిపోతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించాల్సిన ఇనుప చువ్వలను ఏళ్ల తరబడి ఆరుబయట వదిలేయడంతో అవి పనికిరాకుండా పోతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 11:20 AM IST

సీఎం పర్యటనపై టీడీపీ నేతలు ప్రచారం

AKP: సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనపై ఇవాళ కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేస్తారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు.

March 18, 2026 / 11:19 AM IST

ధర్మవరంలో పీ4 కార్యక్రమాలపై మంత్రి సమీక్ష

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో పీ4, బంగారు కుటుంబాల ప్రాజెక్టులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 6,345 బంగారు కుటుంబాలను గుర్తించగా, 3,450 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంస్కృతి సేవా సంస్థ ద్వారా రూ.98 లక్షలతో సైకిళ్ల పంపిణీ, వివిధ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేసినట్లు వివరించారు.

March 18, 2026 / 11:18 AM IST

చిన్నగంజాంలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన MRO

 BPT: చిన్నగంజాం మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎమ్మార్వో ప్రభాకర్ రావు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును ఆయన చీప్, ఇన్విజిలేటర్‌లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న మంచినీరు తదితర సౌకర్యాల గురించి ఎమ్మార్వో ప్రభాకర్ రావు ఆరా తీశారు. శాంతియుత వాతావరణంలో పరీక్షలు జరగాలని సూచించారు.

March 18, 2026 / 11:15 AM IST

శ్రమదానంతో రోడ్డుపనులు

ASR: హుకుంపేట మండలంలోని గొప్పుగరువులో గ్రామస్థులు శ్రమదానంతో రోడ్డుపనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 40 కుటుంబాలు జీవిస్తున్నాయని, సరైన రోడ్డు సదుపాయం లేక రాక పోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. 104, 108 అత్యవసర సమయాల్లో రాలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సంభందిత అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

March 18, 2026 / 11:15 AM IST

తాగునీరు లేదు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..!

KRNL: ఆదోనిలోని 2, 41వ వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బాబాజీ పేట, శుక్రవారంపేట ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం, మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

March 18, 2026 / 11:14 AM IST

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ

 ప్రకాశం: పొగాకు కార్మికులకు రోడ్డు భద్రత, మహిళల రక్షణపై సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

March 18, 2026 / 11:10 AM IST