కోనసీమ: రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. బుధవారం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ పథకం రైతులకు ఊరటనిస్తోందని అన్నారు.
VSP: మద్దిలపాలెం చైతన్య నగర్ కాలనీలో నిరాశ్రయురాలిగా తిరుగుతున్న 70 ఏళ్ల గోవిందమ్మను రెడ్ క్రాస్ ప్రతినిధులు గుర్తించి రక్షణ కల్పించారు. ఎంవీపీ సీఐ ప్రసాద్, బ్లూ కోర్టు సిబ్బంది సహకారంతో ఆమెను పెందుర్తిలోని లయోలా వృద్ధాశ్రమానికి సురక్షితంగా తరలించారు. పలువురు సామాజిక కార్యకర్తలు, స్థానికులు పాల్గొని ఆమెకు అండగా నిలిచారు.
అనంతపురం: రాయదుర్గం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రామకృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. పాలకవర్గ పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈయనను నియమించింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న రామకృష్ణారెడ్డి నేటి నుంచి రాయదుర్గం మున్సిపల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహశీల్దార్ హరికుమార్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ELR: తాళ్లపూడికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి బుధవారం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న సమయంలో చంద్రశేఖర్ భార్య చేతికి ఉన్న సుమారు 7 గ్రాముల బంగారు బ్రాస్లెట్ ఎక్కడో జారిపోయింది. ద్వారకా తిరుమల పోలీసులను సంప్రదించగా దేవస్థానంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి బ్రాస్లెట్‌ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు.
E.G: రాజమండ్రిలోని క్వారీ సెంటర్ వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగర పాల సంస్థ పలు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వీటిని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అన్నమయ్య: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రాధిక ఆస్పత్రిలోని డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొరత ఉన్న మందుల వివరాలు.. అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు.
KDP: నంద్యాలలో జరగనున్న CITU రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మనోహర్ అన్నారు. బుధవారం CITU కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 18, 19వ తేదీన నంద్యాలలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయిని అన్నారు. వాటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
VZM: రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి కోరారు. ఇవాళ గజపతినగరం మండలంలోని గుడివాడ గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంపై సదస్సు జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని లాభదాయకంగా చేసుకోవాలని సూచించారు. సొసైటీ డైరెక్టర్ రామ్ కుమార్ పాల్గొన్నారు.
TPT: వరదయ్య పాలెంలో మహిళా సాధికారత కోసం చేపట్టిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు అండగా ఉండాల్సిన యంత్రాంగం వారి ఆశలపై నీళ్లు చల్లింది. శిక్షణ ముగిసి సంవత్సరం అవుతున్నా అటు సర్టిఫికెట్లు లేవు, ఇటు కుట్టు మిషన్ల ఆచూకీ లేదట. అసలు ఆ మెషీన్లు ఏమయ్యాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
BPT: కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎంపీడీవో అద్దురి శ్రీనివాసరావు పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై సిబ్బందితో సమీక్షించారు. పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధికి ఈ పనులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో SDP1 ఆధ్వర్యంలో బుధవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ మహబూబ్ బాషా పాల్గొని నిరుపేదలకు రంజాన్ తోఫాను అందజేశారు. ప్రతి ఒక్క నిరుపేద ముస్లిం పండుగను చేసుకోవాలని వీటిని పంపిణీ చేశామన్నారు.
సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రత్యేక అధికారిగా పెనుకొండ ఆర్డీవోను నియమించగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఉత్తర్వులు సవరిస్తూ జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలను చేపట్టాలని ఆదేశించింది.
NLR: సైదాపురం మేజర్ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులును ఆ శాఖా ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అన్నపూర్ణ బుధవారం తనిఖీ చేశారు. ఆమె హాజరు, డీ మస్టర్ పరిశీలించారు. ఎంత వేతనాలు వస్తున్నాయి అని ఉపాధి హామీ శ్రామికులని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు నరేశ్, చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
VZM: గంట్యాడ మండలం మోకాలపాడు MPP స్కూల్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బంకపల్లి శివ ప్రసాద్ తన స్నేహితుని సహకారంతో సైకిళ్లు పంపిణీ చేశారు. గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరం నుంచి స్కూల్‌కి వస్తున్న ఆరుగురు విద్యార్థుల అసౌకర్యాన్ని చూసి ఆయన చలించారు. ఈ సందర్బంగా విద్యార్థులు సంతోషంతో ఆయనకు ధన్యవాదములు తెలిపారు.
GNTR: హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ యాజమాన్యానికి మంత్రి సవిత బుధవారం సూచించారు. టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు.