• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా గంగమ్మ దేవతల తిరుణాల

KDP: లింగాల మండలం చిన్నకుడాల, పెద్దకుడాల గ్రామాల్లోని గంగమ్మ ఆలయాల్లో ఆదివారం గంగమ్మ దేవతల తిరుణాల జరగనుంది. ఆలయ నిర్వాహకులు తిరుణాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గంగమ్మ దేవతలను భక్తులు దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకోనున్నారు.

March 1, 2026 / 06:48 AM IST

తాళం వేసిన ఇంట్లో దొంగతనం..!

W.G: నరసాపురం మండలం కంసాలిబేతపూడిలో భారీ దొంగతనం జరిగింది. పాలీ నాగేశ్వరరావు దంపతులు వైద్యం కోసం పాలకొల్లు వెళ్లి తిరిగి వచ్చేసరికి, దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలోని 4.5 సవర్ల బంగారం, 200 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై టి.వి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 1, 2026 / 06:47 AM IST

నేడు వెల్దుర్తిలో ప్రజాదర్బార్ కార్యక్రమం

PLD: వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అర్జీల రూపంలో సమర్పించవచ్చు. అలాగే, ఉదయం 9 గంటలకు సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.

March 1, 2026 / 06:43 AM IST

విప్పర్లలో పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

PLD: ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమంలో భాగంగా 49వ రోజున శనివారం రాత్రి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. నిరంతరంగా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తీరును స్థానికులు అభినందించారు.

March 1, 2026 / 06:43 AM IST

మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా నిరసన

NTR: మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తిరువూరులో సీపీఐ నేతలు శనివారం నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, ఔషధ ధరలను నియంత్రించే చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేటు ఆసుపత్రుల మాఫియాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

March 1, 2026 / 06:42 AM IST

వేట్లపాలెం ఘటన.. ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు, పవన్ భేటీ

E.G: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో శనివారం రాత్రి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. బాధితులను పరామర్శించి అమరావతి వెళ్తున్న సీఎంకు, కాకినాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు.

March 1, 2026 / 06:40 AM IST

వీరులపాడులో సైన్స్ డే వేడుకలు

NTR: వీరులపాడు మండలం జుజ్జూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఈవో విద్యార్థులు తయారు చేసిన నమూనాలను చూసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:36 AM IST

డ్వాక్రా మహిళలకు రుణాలు..!

KDP: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా NTR విద్యాలక్ష్మీ ,NTR కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రారంభించనుంది. ఈ పథకాల కింద డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.100,000 వరకు రుణం అందించబడుతుంది. NTR కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా కుమార్తెల వివాహాల కోసం, NTR విద్యాలక్ష్మీ పథకం ద్వారా పిల్లల విద్యాభ్యాసం రుణాలు పొందవచ్చు.

March 1, 2026 / 06:35 AM IST

నేడు మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ:  రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు  మసకపల్లి గ్రామంలో  కోరమండల్ కంపెనీ వారి సీఎస్ఆర్ నిధులతో వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో నందు రేగుబడవలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 

March 1, 2026 / 06:35 AM IST

కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

BPT: కారంచేడు మండలం కుంకలమర్రులోని కొమ్మమూరు కాలువ వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. ఎస్సై ఖాదర్ భాష తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం నరసయ్యపాలెం లాకుల వద్ద నుండి నీటిలో కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 1, 2026 / 06:34 AM IST

అంబటి రాంబాబును పరామర్శించిన ఎమ్మెల్యే

గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో శనివారం రాత్రి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ వేధింపులకు ఏ మాత్రం వెనుకాడబోమని, ప్రజల తరఫున పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.

March 1, 2026 / 06:33 AM IST

డ్యామ్ నిర్మాణానికి రూ. 166.40 కోట్లు విడుదల

ప్రకాశం: పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వర డ్యాం నిర్మాణానికి రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సంగమేశ్వర రిజర్వాయర్ ద్వారా కొండపి నియోజకవర్గంలో 9500 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 25 కోట్లు కేటాయించారని అన్నారు.

March 1, 2026 / 06:31 AM IST

క్రికెట్ మ్యాచ్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే

ATP: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఈ లీగ్‌లో ఆయన సందడి చేస్తున్నారు. ఏపీ పొలిటికల్ లయన్స్ జట్టుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారథ్యం వహిస్తున్నారు.

March 1, 2026 / 06:31 AM IST

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: SP

KRNL: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ 1,536, హెల్మెట్ లేకుండా 1,388, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 392, ట్రిపుల్ రైడింగ్ 63 కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు.

March 1, 2026 / 06:29 AM IST

నేడు పామూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: పామూరు పట్టణంలో కొత్త విద్యుత్ లైన్ల పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాయబ్ రసూల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పామూరులోని పాత స్టేట్ బ్యాంకు రోడ్డు, కరెంట్ ఆఫీస్ కాలనీ, ఇరువురు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 1, 2026 / 06:28 AM IST