ATP: విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఈ లీగ్లో ఆయన సందడి చేస్తున్నారు. ఏపీ పొలిటికల్ లయన్స్ జట్టుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సారథ్యం వహిస్తున్నారు.