• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సచివాలయ స్థలం కబ్జా పట్టించుకొని అధికారులు

VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కూతవేటు దూరంలో ఉన్న సచివాలయం-4 వద్ద ఓ వ్యక్తి బడ్డీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగస్తులు కార్యాలయానికి వెళ్ళడానికి ఆ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తారు. సచివాలయ స్థలం కబ్జా జరిగిన అధికారులు దానివైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలం కబ్జా గురైన పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2026 / 02:12 PM IST

ఈనెల 24న జిల్లా స్థాయి క్రీడా పోటీలు

PPM: ఈనెల 24న జిల్లా క్రీడా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. శ్రీధర్ రావు బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాప్ లీగ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో 24వ తేది ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయన్నారు.

March 18, 2026 / 02:11 PM IST

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: మండవల్లి మండలం లోకుమూడి గ్రామంలో మండల ప్రాధమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని బుధవారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. పిల్లలు తింటున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేసారు. ప్రతి రోజు పెడుతున్న భోజనం మెను, భోజనం రుచి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

March 18, 2026 / 02:09 PM IST

దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఇంఛార్జ్ మంత్రి

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద నేటి నుంచి కనీసం 40 శాతం అంగవైకల్యం కలిగిన వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 18, 2026 / 02:07 PM IST

రైతుల సంక్షేమమే లక్ష్యం: మంత్రి

సత్యసాయి: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల మండలం పాలసముద్రంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులతో మంత్రి రైతుల ఇళ్లకు వెళ్లి, ఏయే పంటలు వేస్తే డిమాండ్ ఉంటుందో వివరించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.

March 18, 2026 / 02:06 PM IST

చిత్తూరులో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

CTR: చిత్తూర్ నూతన ఆర్టీసీ బస్టాండ్‌లో ఇంఛార్జ్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో చూడా ఛైర్మన్ కటారి హేమలత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ రూప శ్రీ తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 02:01 PM IST

ఆదోనిలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం

KRNL: ఆదోని మండలం మంత్రికి గ్రామాల్లో ‘రైతన్న మీకోసం–అన్నదాత సుఖీ భవ’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. టిడిపి నేత సిద్ధార్థ నాయుడు రైతులను ఇంటింటికి కలిసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు తెలుసుకొని, కరపత్రాలు పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20,000 సాయం అందిస్తున్నట్లు వివరించారు.

March 18, 2026 / 02:01 PM IST

మహిళ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు అందజేత

E.G: రాజమండ్రి రైల్వే‌స్టేషన్ అడ్వైజరీ కమిటీ బోర్డు సభ్యులు, రైల్వే సిబ్బంది ఇవాళ పారిశుద్ధ్య నిర్వహణలో విశేష సేవలు చేస్తున్న మహిళలను సాలువాతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం & ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని వారికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చీరలు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికుల అంకితభావం సేవలను ప్రశంసించారు.

March 18, 2026 / 02:00 PM IST

ఘనంగా ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమం ప్రారంభం

TPT: రాష్ట్రవ్యాప్తంగా ‘దివ్యాంగ శక్తి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన నేపథ్యంలో తిరుపతి జిల్లా అలిపిరి డిపోలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వారి దైనందిన జీవితంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు.

March 18, 2026 / 02:00 PM IST

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విజయనగరం తోటపాలెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయలని సిబ్బందికి సూచించారు.

March 18, 2026 / 02:00 PM IST

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

NDL: మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలోని ఐలమ్మ విగ్రహం ఎదుట బుధవారం వికలాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు.. దివ్యాoగుల పట్ల CM సానుభూతితో పాటు పెన్షన్లు పెంచడమే కాకుండా వికలాంగుల ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి ఆదుకుంటున్నందుకు CM చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 

March 18, 2026 / 01:58 PM IST

‘రైతులకు అండగా కూటమి ప్రభుత్వం’

VZM: బొబ్బిలి మండలం సీతయ్యపేటలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎల్లపుడు రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

March 18, 2026 / 01:52 PM IST

అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహం

PLD: అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహం నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ ఉపయోగించారు. మూడు అంతస్తుల బేస్‌పై నిర్మించిన ఈ విగ్రహానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేశారు. పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సమీకరించిన నిధులతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

March 18, 2026 / 01:44 PM IST

సోమశిల జలాశయం నీటి వివరాలు

NLR: సోమశిల జలాశయం నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 664 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా జలాశయంలో 62.606 TMCల నీటిమట్టం నమోదైంది. పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 600 క్యూసెక్కులు, NFCకు 650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

March 18, 2026 / 01:37 PM IST

వికలాంగులకు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం

TPT: సూళ్లూరుపేటలో వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్డీవో జెండా ఊపి ప్రారంభించారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 40% పైగా వికలాంగులకు ఈ సదుపాయం కల్పించింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, ఎంపీడీవో మురళి, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ పథకం వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

March 18, 2026 / 01:34 PM IST