GNTR: జీఎంసీకి పన్ను వసూళ్లపై ఉన్న ఆసక్తి వీధికుక్కల నియంత్రణపై లేదని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ విమర్శించారు. కుక్కల దాడులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కొత్తపేటలో బుధవారం మాట్లాడుతూ.. పట్టుకున్న కుక్కలకు వ్యాక్సిన్ వేసి వదలకుండా, శివారు ప్రాంతాల్లో ఆవాసం కల్పించాలని సూచించారు.
NLR: వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డు, మంచినీటి ట్యాంక్‌ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. వైసీపీ హయంలో ట్యాంక్ ఏర్పాటు చేశారు గానీ అందుకు కావలసిన మెట్లను కట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
GNTR: ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆయన ప్రయాణించి పథకంపై అవగాహన కల్పించారు. ఈ సౌకర్యం ద్వారా దివ్యాంగులు అవసరాల కోసం సులభంగా ప్రయాణించగలుగుతారని పేర్కొన్నారు.
VZM: విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని స్థానిక RTC ఆవరణలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సేధు మాధవన్, ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
PPM: ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపారవత్తగా తయారయ్యి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఇంఛార్జ్ డీఆర్డీఏ పీడీ వైశాలి అన్నారు. బుధవారం జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామంలో మహిళా సంఘాలు సభ్యులు వివిధ పథకాలలో తీసుకొన్న రుణాలు ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేది పరిశీలించారు. అనంతరం పాన్ షాప్ నిర్వహిస్తున్న మహిళతో మాట్లాడారు.
W.G: పెనుమంట్ర MRO కార్యాలయం వద్ద బుధవారం సెక్రటరీలు, VROలు, సర్వేయర్లతో తహశీల్దార్ రవికుమార్ సమీక్ష నిర్వహించారు. జనగణన – 2027 ఫేజ్-1కు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మ్యాపింగ్, ల్యాండ్ మార్క్ గుర్తింపుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మ్యాపులు గీసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో ASO అశోక్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో జేసీ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లే అవుట్ అప్రూవల్ నిమిత్తం పెండింగ్‌లో ఉన్న పలు సర్వే నెంబర్లను జేసీ కల్పనకుమారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. జేసీ వెంట అద్దంకి ఆర్డీవో, ఇతర మండలాల ఎమ్మార్వోలు, సర్వేయర్లు ఉన్నారు.
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.57 నుంచి 12.46 వరకు అభిజిత్ లగ్నంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. భక్తులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని రూ.300 టికెట్ తీసుకోవాలని ఈవో పెంచల కిశోర్ సూచించారు.
సత్యసాయి: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపన కోసం కేటాయించిన భూముల పురోగతిపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్షించారు. ఏపీఐఐసీ, నెడ్‌క్యాప్ సంస్థలకు నిర్దేశించిన గడువులోగా భూములను అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణలోని అడ్డంకులు తొలగించి, సరిహద్దుల గుర్తింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
CTR: విజయపురం గ్రామంలో మూడో విడత ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమం భాగంగా రైతులకు ఫాంప్లెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతులకు అందిస్తున్న సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రిలో విషాదం నెలకొంది. లక్ష్మీ ప్రసన్న (30) అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 20 రోజుల క్రితమే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఈ ఘోరానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మీ ప్రసన్న డిప్రెషన్‌తోనే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: చాగల్లులో ఇవాళ నిర్వహించిన ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరి బాబు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: మద్యం కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డిని గురువారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. అవినాశ్ రెడ్డికి విధించిన 3 రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా.. గుంటూరు జిల్లా జైలు నుంచి అతడిని విజయవాడకు తరలించి అధికారులు విచారణ చేపట్టారు. కాగా, మద్యం కేసులో ఏ-1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి, అవినాశ్ రెడ్డి సమీప బంధువు.
VSP: గాజువాక పరిధిలోని 87వ వార్డు కణితి గ్రామంలో నూకాలమ్మ పండుగ బుధవారం నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి కుంకుమ పూజలు నిర్వహించి దేవాలయాన్ని పూలతో అలంకరించారు. సాయంత్రం ఘటాల ఊరేగింపు జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాస్, బొడ్డ గోవింద, ముద్దపప్పు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డి గారిపల్లిలో బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.