CTR: ఐరాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని MLA మురళీమోహన్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
KDP: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి షరీఫ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు డిప్యూటీ తహశీల్దార్ సుదర్శన్‌కు గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏజెన్సీల వారు గ్యాస్ సిలిండర్లను ప్రజలకు కాకుండా వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
SKLM: పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఉగాది పండుగ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనది అని.. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ఒకటని అన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
KRNL: మండల పరిధిలోని కోతి కొండ గ్రామంలో బుధవారం వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 30 నిమిషాల పాటు వడగండ్లతో వర్షం కురిసింది .అలాగే మెరుపులు, ఉరుముల శబ్దంతో పాటు గాలులు వ్యాపించడంతో పొలాల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడక్కడ మామిడి కాయలు చెట్ల పై నుండి క్రింద పడ్డాయి. దీంతో పలువురు మామిడి రైతులకు నష్టం కూడా వాటిల్లింది.
తిరుపతి SVUలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిపై సమావేశం జరిగింది. అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొని, 2030 నాటికి అమరావతి ఈ రంగంలో ప్రముఖ కేంద్రంగా మారుతుందని తెలిపారు. VC నర్సింగారావు పరిశోధన అవకాశాల విస్తరణకు వర్సిటీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కోనసీమ: వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే MSMEలకు మద్దతునిస్తూ, బ్యాంకర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ అధికారులతో కలిసి పాల్గొన్నారు. MSMEలు అభివృద్ధి చెందేలా బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు.
ATP: ఉగాది పండుగ పురస్కరించుకుని అనంతపురం అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం రద్దు చేసినట్లు సెక్రెటరీ జీ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.
సత్యసాయి: కదిరి పట్టణంలోని ఔలిల్లా మసీదులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్న ఎస్పీ, వారికి స్వయంగా ఇఫ్తార్ విందు వడ్డించారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి, క్రమశిక్షణకు నిలువుటద్దమని ఆయన పేర్కొన్నారు.
WG: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని నరసాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. బుధవారం నరసాపురం పార్టీ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు
KKD: ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో పరిమాణంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి వ్యక్తం చేసి కలెక్టర్ షణ్మోహన్ కు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ప్రకారం ఫోటో సైజును నిర్దేశిస్తూ అధికారులకు మెమో ఇవ్వాలని ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారన్నారని వర్మ పేర్కొన్నారు.
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 14, 15 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉచిత HPV టీకాలు అందించారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ప్రమీలా దేవి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ టీకా సురక్షితమని.. HPV వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించారు.
SKLM: మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రాష్ట్ర ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షాన పోరాటమే అసలైన పండుగని పేర్కొన్నారు. జగనన్న వెంటే మా ప్రయాణమని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం వైఎస్ జగన్ మోహన్ నేర్పిన పాఠమన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నట్లు తెలిపారు.
KRNL: దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ ఏ. సిరి అన్నారు. బుధవారం కర్నూలు బస్టాండ్లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి కలెక్టర్ బస్సులో ప్రయాణించారు.
ASR: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని చవటపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రకాశం: పెద్దారవీడు మండలం పుచ్చాకాయలపల్లె గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డివిజినల్ అభివృద్ధి అధికారి బాలునాయక్ బుధవారం సందర్శించారు. ఇంటి పన్ను కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన, ప్రజలకు తాగునీరు అందిస్తున్న చలివేంద్రం ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు.