• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేలంలో రూ. 18 లక్షల ఆదాయం

CTR: సదుం పంచాయతీ వనరుల బహిరంగ వేలం బుధవారం నిర్వహించారు. ఇందులో వారపు సంతను రూ. 16.30 లక్షలకు మనోజ్ కుమార్ దక్కించుకున్నారు. దినసరి మార్కెట్ రూ. 60,500, ప్రైవేటు బస్టాండు రూ. 68 వేలు, పూలమార్కెట్ రూ. 73,500, జంతువధ శాల రూ. 4 వేలకు వేలం పలికాయి. గతేడాది కంటే సుమారు రూ. 6 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

March 18, 2026 / 08:30 PM IST

‘రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’

సత్యసాయి: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు హిందూపురం రూరల్ సీఐ కె.జనార్ధన్ పేర్కొన్నారు. బుధవారం చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను NHAI అధికారులతో కలిసి ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో SI మునీర్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 08:28 PM IST

దివ్యాoగ శక్తి పథకం ఆనందదాయకం: MLA

NDL: దివ్యాoగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఎంతో ఆనంద దాయకమని MLA జయసూర్య అన్నారు. బుధవారం నంది కొట్కూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వికలాంగులతో పాటు ఆయన హాజరై, రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు. వికలాంగులు సంతోష వ్యక్తం చేస్తూ, CM చంద్రబాబు, MLA జయసూర్యకు దన్యవాదాలు తెలిపారు.

March 18, 2026 / 08:27 PM IST

గోడ కూలి బాలుడు మృతి.. MLA పరామర్శ

NDL: ఇవ్వాల సాయంత్రం కురిసిన వర్షానికి గోడ కూలి అభి (2) అనే బాలుడు మృతి చెందిన సంఘటన పగిడ్యాల మండలo, ప్రాతకోటలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న MLA జయసూర్య నంది కొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అభి కుటుంబ సభ్యులను పరామర్శించి, బాలుడు కుటుంబ పరిస్థితిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని MROను ఆదేశించారు. ప్రభుత్వo నుంచి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. 

March 18, 2026 / 08:26 PM IST

జీవో నంబరు 5ను వ్యతిరేఖిస్తూ నిరసన

W.G: దుకాణాలు 24 గంటల పాటు తెరిచేందుకు అనుమతినిస్తూ విడుదల చేసిన జీవో నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో జీవోకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల కార్మికులపై పనిభారం పెరిగి, వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

March 18, 2026 / 08:22 PM IST

జీవో నెంబరు 5ను వ్యతిరేఖిస్తూ నిరసన

W.G: దుకాణాలు 24 గంటల పాటు తెరిచేందుకు అనుమతినిస్తూ విడుదల చేసిన జీవో నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వాసుదేవరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో జీవోకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల కార్మికులపై పనిభారం పెరిగి, వారి ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

March 18, 2026 / 08:22 PM IST

పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

ATP: అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్ అభివృద్ధి పనులను జూన్ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లేఅవుట్‌లో జరుగుతున్న డ్రైనేజీలు, రోడ్లు, వాటర్ సప్లై పనులను స్వయంగా పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలని సూచించారు.

March 18, 2026 / 08:21 PM IST

ముస్లిం సోదరులకు పండుగ కానుకలు

అన్నమయ్య: మదనపల్లె నవ జీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుకలు బుధవారం పంపిణీ చేశారు. కోళ్ల బైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పద్మావతమ్మ, కోశాధికారి కృష్ణ పూజిత, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు. రంజాన్, ఉగాది పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

March 18, 2026 / 08:20 PM IST

విజయనగరాన్ని జల్లెడ పట్టిన పోలీసులు

విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్సైలు, RPF, జీఆర్‌పీ బృందాలతో పాటు శునక దళం (రుద్ర, రియా) సహకారంతో రైల్వే స్టేషన్, పార్సెల్ రూమ్, ముఖ్య రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

March 18, 2026 / 08:19 PM IST

‘రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి’

KRNL: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని ఏపీ రజక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ సావిత్రి కోరారు. ఎన్నికల సందర్భంగా రజకులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని విజయవాడలోని ఉండవల్లిలో మంత్రి లోకేశ్‌ను కలిసి బుధవారం వినతిపత్రం ఇచ్చారు. దేవాలయ పాలకమండలిలో నాయీ బ్రాహ్మణుల తరహాలో సభ్యులుగా ఉండేలా రజకులకు అవకాశం కల్పించాలన్నారు.

March 18, 2026 / 08:19 PM IST

195 ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించిన ముఠాను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4 లక్షల విలువైన 400 కేజీల రాగి వైరు, 2 ఆటోలు, 2 బైకులు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.

March 18, 2026 / 08:16 PM IST

దివ్యాంగులకు ఉగాది, రంజాన్ కిట్ల పంపిణీ

NDL: నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో పేద దివ్యాంగులకు ఉగాది, రంజాన్ కిట్లను బుధవారం పంపిణీ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దివ్యాంగులకు పండుగ కిట్లను పంపిణీ చేస్తున్నామని, వారి సంక్షేమం కొరకు సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 08:16 PM IST

‘పన్ను బకాయిలపై 50% రాయితీ’

KRNL: ప్రభుత్వం జారీ చేసిన GO 58 మేరకు డోన్ మున్సిపాలిటీలో ఇంటి పన్ను బకాయిల వడ్డీపై 50% రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ బుధవారం తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే ఉందన్నారు. రాయితీ పొందాలంటే బకాయిలను ఒకేసారి పూర్తిగా చెల్లించాలని పేర్కొన్నారు. ప్రజలు ఇంటి, నీటి, ఖాళీ స్థలాల పన్నులు వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సూచించారు.

March 18, 2026 / 08:15 PM IST

‘ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి’

ASR: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కొత్తాబు గ్రామంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూగర్భ జలాలను కాపాడుకుంటూ, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు డ్రిప్‌ని వాడాలని సూచించారు

March 18, 2026 / 08:14 PM IST

ఉగాది పండుగ.. కిటకిటలాడుతున్న పూలదుకాణాలు

KDP: నగరంలోని పాత బస్టాండు వద్ద పూల దుకాణాలు కిక్కిరిసిపోయాయి. ఉగాది పండుగ రావడంతో పూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున దుకాణాలకు వచ్చారు. నిన్నటి వరకు బంతి పూలు కిలో పది రూపాయలు ఉండగా, ప్రస్తుతం పండుగ వల్ల కిలో రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. అలాగే కనకాంబరాలు కిలో రూ.700 వరకు ధర పలుకుతుంది.

March 18, 2026 / 08:11 PM IST