VSP: సీతమ్మధార సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతులు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ పథకాలపై వివరించారు. చదువులో రాణించి దేశానికి సేవ చేయాలని సూచించారు.
అన్నమయ్య: జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తే, పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం కార్మికులను పోలీసులు అడ్డుకొని, ధర్నాలకు అనుమతి లేదని వెళ్ళిపోవాలని ఆదేశించడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది.
ప్రకాశం: పామూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను TDP నాయకుడు మనోహర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, విధవులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
E.G: నిడదవోలు మాలకోడులో రూ. 105 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు నాయుడు హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో హుండీల ద్వారా 93 రోజులకు గాను రూ.6,81,751 లక్షత ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీ.రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆలయ ఛైర్మన్ కె. గోవిందరావు సమక్షంలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. మందసకు చెందిన ఈవో ఎస్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌ను చైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం తెల్లవారుజామున 4 గంటలకే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యార్డులో సౌకర్యాలు, క్రయవిక్రయాల తీరును పర్యవేక్షించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కోనసీమ: కులాంతర వివాహం ఇష్టం లేని కారణంతోనే ద్వారపూడికి చెందిన పోలుపల్లి వీరవెంకట సూర్య ప్రకాశరావును యువతి సోదరులు హత్య చేసినట్లు రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. అయినవిల్లి డిప్యూటీ తహశీల్దార్ సంధ్య, ఆమె సోదరుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. మృతుడి ఇంటి వద్దకు వెళ్లి రాళ్లతో దాడి చేయడంతో రక్తస్రావమై మృతి చెందారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఏలూరు: నగరంలోని టీ పొడి దుకాణాలపై విజిలెన్సు, ఆహార భద్రత, తునకలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. కొన్ని టీ పొడి లేబుల్స్ తేడాగా ఉండడానికి గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు తరలించామన్నారు. మొత్తం 3 షాపుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు.
కడప: ఐఎంఏ హాల్‌లో ఈనెల 28, మార్చి 1 తేదీల్లో వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పుత్తా పుల్లారెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు జరగనుంది. ఈసదస్సులో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, వీసీలు జయరామిరెడ్డి, నిత్యానందరావు పాల్గొంటారు. ఈ సందర్భంగా శృంగార శాకుంతలం గ్రంథావిష్కరణ,18 మంది పరిశోధకులతో పత్ర సమర్పణలు ఉంటాయని అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి తెలిపారు.
KRNL: మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేడు ఉదయం 8:30 కు నంద్యాల టౌన్ 14వ వార్డు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత ఉదయం 11:30 నేషనల్ డిగ్రీ కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు పాల్గొని మంత్రి సూచనలు స్వీకరిస్తారు.
VSP: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువతను మోసం చేసిన కేసులో ఐదుగురికి విశాఖ నాల్గవ అదనపు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంవీపీ పోలీసుల వివరాల ప్రకారం.. 2021లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.
కడప: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
BPT: సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, టీడీపీ నేత వర్ల రామయ్య శుక్రవారం సీఐడీ డీజీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజలు తిరస్కరించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదని నసీర్ మండిపడ్డారు.
NDL: కలెక్టర్ రాజకుమారి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులకు శుక్రవారం కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సునీల్ షౌరాణ్‌తో కూడిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.