• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

TPT: తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. కొత్త కండ్రిగ గ్రామానికి చెందిన రాజా, అమరావతికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు కారణంగా అమరావతి సోమవారం పురుగులు మందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

March 3, 2026 / 01:46 PM IST

అంగన్వాడీలు అక్రమ అరెస్టులు అన్యాయం

VZM: తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం విజయవాడలో శాంతి యుత దీక్షలు చేస్తున్నా అంగన్వాడి కార్యకర్తలను అరెస్టులు చెయ్యడం అన్యాయం అని సీఐటీయూ పి.శంకరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు.

March 3, 2026 / 01:39 PM IST

‘మహిళా ఉపాధి రక్షణకై ఉద్యమించాలి’

SKLM: శ్రామిక మహిళల ఉపాధి పై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉద్యమించాలని పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ అన్నారు. మంగళవారం పలాస మండలం మామిడిపల్లిలోని మార్చి 8న జరిగే సభలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మార్చి 1 నుంచి 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.

March 3, 2026 / 01:38 PM IST

‘స్మశాన వాటికను ఆక్రమనపై చర్యలు తీసుకోవాలి’

E.G: గోపాలపురం మండలం సాగిపాడు గ్రామ ప్రజలకు సంబంధించిన స్మశాన వాటికను తణుకు వేములయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోపాలపురం జనసేన ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు తెలిపారు. దీనిపై విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని దేవరపల్లి సీఐ, ఎస్సై, తహసీల్దార్‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 3, 2026 / 01:37 PM IST

రేపు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన

NLR: గుడ్లూరు మండలంలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులైన కర్లపాలెం మత్స్యకారులకు R&R కాలనీలో నివేశన పట్టాలను మంత్రి పంపిణీ చేస్తారంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు కూటమి నేతలు పాల్గొంటారని పేర్కొంది.

March 3, 2026 / 01:37 PM IST

ఈనెల 5 నుంచి కిరండూల్ రైలు ర‌ద్దు

VSP: వాల్తేర్ డివిజన్‌లో శిలిమ్లిగూడ–కరకవలస మధ్య డబుల్ లైన్ పనుల కారణంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. దీంతో విశాఖపట్నం–కిరండూల్ మధ్య నడిచే 58501, 58502 ప్యాసింజర్ రైళ్లు మార్చి 5 నుంచి 14/15 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

March 3, 2026 / 01:36 PM IST

చింతపల్లిలో దుకాణాల తరలింపుపై ఎంపీడీవో హెచ్చరిక

ASR: ప్రధాన రహదారుల వెంట నిర్వహిస్తున్న చేపలు, మాంసం దుకాణాలను ప్రభుత్వం కేటాయించిన సంత మార్కెట్ ప్రాంగణానికి తప్పనిసరిగా తరలించాలని చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి హెచ్చరించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, లాటరీ విధానంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొందరు వ్యాపారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆమె తెలిపారు.

March 3, 2026 / 01:35 PM IST

మిట్ట కండ్రిగలో చెరుకు తోట దగ్ధం

CTR: శ్రీరంగరాజపురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ మిట్టకండ్రిగ హరిజనవాడలో రైతు నవీన్‌కు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన తెల్లబెల్లం కూడా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:34 PM IST

అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

ATP: పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలోని సుంకులమ్మ దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మంగళవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నూతన దేవాలయ నిర్మాణానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

March 3, 2026 / 01:33 PM IST

46వ డివిజన్‌లో వీధి లైట్ల సమస్య పరిష్కారం

ATP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో 46వ డివిజన్ పరిధిలో వీధి లైట్ల సమస్య పరిష్కారమైంది. స్థానిక నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. దీంతో 3, 4, 5వ రోడ్లలో నూతనంగా వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 01:32 PM IST

శ్రీ తుట్టే తమ్మ ఆలయంలో సౌకర్యాల లేమి..!

TPT: హనుమంతపురం గ్రామంలోని శ్రీ తుట్టే తమ్మ అమ్మవారి దేవాలయంలో మౌలిక సదుపాయాల లేమి తీవ్రంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు, తాగునీటి సదుపాయం లేకపోవడంతో పాటు ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. హుండీ ఆదాయం, విరాళాల వినియోగంపై స్పష్టత లేదని ఆరోపిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను కోరారు.

March 3, 2026 / 01:30 PM IST

మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన టీడీపీ నేతలు

ATP: అనారోగ్యంతో సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ చౌదరిని ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పరామర్శించారు. ఆయన కుమారుడు మారుతిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చౌదరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 01:30 PM IST

‘వరికి గిట్టుబాటు ధర ప్రకటించాలి’

NLR: అనంతసాగరం, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమశిల జలాశయం కింద సాగు చేసిన వరి పంట మరో వారం రోజుల్లో మార్కెట్‌కు రానుందని సీపీఎం, రైతు సంఘం నేతలు తెలిపారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పుట్టికి కనీసం రూ.26 వేలు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ అనంతసాగరం తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

March 3, 2026 / 01:29 PM IST

విజయవాడలో అక్రమ అరెస్టులు నిరసిస్తూ ధర్నా

ATP: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో చేపట్టిన సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీలతో కలిసి రోడ్డుపై నిల్చుని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వారు హెచ్చరించారు.

March 3, 2026 / 01:26 PM IST

జిల్లాలో ఘనంగా సైన్స్ వారోత్సవాలు: డీఈవో

కోనసీమ: విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నామని, 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయన్నారు. 6 టీమ్‌లు ఫైనల్స్ ఎంపిక అవుతాయన్నారు.

March 3, 2026 / 01:26 PM IST