• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు ఈ ఆలయం మూసివేత

ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేవూరు పాలెం సెంటర్లోని వేంచేసి ఉన్న శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంగళవారం మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి శ్రీ స్వామివారి దర్శనాన్ని నిలిపివేసి తిరిగి బుధవారం 8 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.

March 2, 2026 / 02:30 PM IST

అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం

KRNL: వెల్దుర్తిలో AITUC ఆధ్వర్యంలో, ఏపీఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మహా ధర్నాకు బయలుదేరుతున్న కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు నాగమద్దయ్య మాట్లాడుతూ, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

March 2, 2026 / 02:30 PM IST

పీజీఆర్ఎస్‌లో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై అర్జీలను తీసుకొని వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజల సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

March 2, 2026 / 02:21 PM IST

50 మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు

అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ సహకారంతో 50 మందికి పైగా మూగ, బధిర చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చిన్నారులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ సర్జరీలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

March 2, 2026 / 02:20 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ ఛైర్మన్

NLR: అల్లూరు మండలం పురిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ మర్రిబోయిన సురేంద్ర ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ-పంట నమోదు చేసుకుని, ఈకేవైసీ పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని సూచించారు.

March 2, 2026 / 02:20 PM IST

‘కాలేజీలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలి’

కోనసీమ: 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే కాలేజీలోకి అనుమతించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో 60% మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బైక్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉండాలన్నారు. కాలేజీలు ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 02:20 PM IST

సూలాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

E.G: రాజమండ్రిలోని బర్మా కాలనీ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద సూలాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.

March 2, 2026 / 02:08 PM IST

రాయలసీమ ద్రోహి జగనే: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అన్నమయ్య: రాయలసీమ హక్కుల పేరిట వైసీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం రాజకీయ డ్రామా మాత్రమేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

March 2, 2026 / 02:05 PM IST

ప్రజా వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్

TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మాండ్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

March 2, 2026 / 02:04 PM IST

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

BPT: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. సోమవారం బాపట్లలో 43 మంది లబ్ధిదారులకు రూ.20,73,963 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు.

March 2, 2026 / 02:03 PM IST

వలసపాకలలో రైతులకు వరి సాగు ఆశలు

KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ ఏర్పడింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు మార్కెట్లకు వెళుతున్నారు. అయితే ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు.

March 2, 2026 / 02:02 PM IST

అత్యాచారానికి పాల్పడిన యూట్యూబర్ అరెస్ట్

ELR: జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్‌గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 2, 2026 / 02:02 PM IST

‘జిల్లాలో త్వరలో అభివృద్ధి పనుల ప్రారంభం చేస్తాం’

NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. చంద్రమౌళి నగర్లో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో చేపట్టిన 240 పనుల్లో ఇప్పటికే 235 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మార్చి 3వ వారంలో ప్రారంభిస్తామన్నారు.

March 2, 2026 / 02:01 PM IST

అనారోగ్యంతో వార్డు మెంబర్ భర్త మృతి

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో వార్డు మెంబర్ గోవిందమ్మ భర్త, వైసీపీ నాయకులు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, స్థానిక నాయకుడు జాము మూకయ్య తదితరులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

March 2, 2026 / 02:01 PM IST

దశాబ్దాల కల నెరవేరిందని కాలనీ ప్రజల హర్షం

KDP: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శివానందపురం కాలనీ మెయిన్ రోడ్డును టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి నాయకత్వంలో సుమారు రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ రహదారి స్థానికులకు ఎంతో ఉపశమనం కలిగించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 2, 2026 / 02:01 PM IST