• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్‌కి విశేష స్పందన

VZM: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అందిన మొత్తం 200 వినతుల్లో అత్యధికంగా 95 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతులు పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 2, 2026 / 05:14 PM IST

చెస్ పోటీల్లో మొదటి స్థానంలో జిల్లా వాసి

AKP: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీగ్ చెస్ పోటీల్లో అండర్ 15 విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన బి శ్రావ్యశ్రీ మొదటి స్థానంలో నిలిచింది. అండర్ 13 విభాగంలో బి. సహస్ర, అండర్ 17 విభాగంలో వి. వెంకటేశ్వరరావు మూడో స్థానం సాధించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజను జాయింట్ కలెక్టర్ అభినందించారు.

March 2, 2026 / 05:13 PM IST

‘ఐవీఆర్ఎస్ కాల్స్‌కు స్పందించాలి’

ASR: ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్‌కు తప్పకుండా స్పందించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు ప్రజలను కోరారు. ఆయన సోమవారం రావణాపల్లిలో పర్యటించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 05:12 PM IST

‘పీజీఆర్ఎస్‌కు 54 ఫిర్యాదులు’

CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు అందాయన్నారు.

March 2, 2026 / 05:11 PM IST

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఎంపీ

VSP: పేదల ఆరోగ్యానికి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఎంపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా 22 లక్షల పైగా మంజూరైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బాధితులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు.

March 2, 2026 / 05:11 PM IST

‘ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

VZM: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అతిది విజయలక్ష్మి గజపతిరాజు కలిసి వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ఆర్టీసీ సంస్థ నుంచి జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని పబ్లిక్ సెక్రెటరీ అశోక్‌ కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

March 2, 2026 / 05:06 PM IST

విగ్రహాల పునః ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

NTR: తిరువూరు(M) అక్కపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నాభిశిలాంబ శ్రీ ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం ఈనెల 8వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును వ్యక్తిగత ఆఫీసులో కమిటీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కమిటీ సభ్యులు నాగిరెడ్డి సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

March 2, 2026 / 05:05 PM IST

అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్

W:G: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెచ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

March 2, 2026 / 05:04 PM IST

‘జనసేన పార్టీ బలోపేతానికి కృషి’

KRNL: గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు సొసైటీ డైరెక్టర్, జనసేన పార్టీ మండల నాయకులు హనుమేష్ స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని అన్నారు.

March 2, 2026 / 05:00 PM IST

పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పబ్లిసిటీ పిచ్చితో జగన్ పాసుపుస్తకాలపై తమ బొమ్మ వేసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. నేడు రాజముద్రతో కూటమి ప్రభుత్వం రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

March 2, 2026 / 05:00 PM IST

కలికిరిలో శ్రీవారి భక్తుల వ్యాన్ బోల్తా

అన్నమయ్య: తిరుమల దర్శనం ముగించుకుని వెళ్తుండగా కలికిరి సమీపంలో ఇవాళ ఓమ్నీ వ్యాన్ టైరు పేలిపోవడంతో బోల్తా పడింది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడగా, వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 05:00 PM IST

VRSల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతి

KDP: సమాన పనికి సమాన వేతనం కింద రూ. 26వేలు జీతం చెల్లించాలని VRA అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటపతి డిమాండ్ చేశారు. సోమవారం సిద్ధవటం తహసీల్దార్ ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం జూన్ 6న నిర్వహించబోయే ‘చలో విజయవాడ’లో వీఆర్ఏలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

March 2, 2026 / 05:00 PM IST

మంగళగిరి పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీలు

GNTR: గుంటూరు జిల్లా డీఈవో సోమవారం మంగళగిరిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీవర్స్ కాలనీ, ఆత్మకూరు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, బోధన తీరుపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, వాటిని మరింత మెరుగుపరచాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.

March 2, 2026 / 05:00 PM IST

‘జనాభాగంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది లాంటిది’

కృష్ణా: మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో భారతదేశ జనాభా గణన-2027 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా గణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటిదని, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం సరిగ్గా, పారదర్శకంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.

March 2, 2026 / 05:00 PM IST

ఆశా వర్కర్ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం

సత్యసాయి: కుమ్మరవండ్లపల్లి పంచాయతీ చర్చి వీధికి చెందిన ఆశా వర్కర్ సరస్వతి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన ఆయన, తన తండ్రి మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ద్వారా దహన సంస్కారాల కోసం రూ. 10,000 నగదును అందజేశారు.

March 2, 2026 / 05:00 PM IST