ప్రకాశం: జరుగుమల్లి మండలం పైడిపాడులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో పబ్లిసిటీ పిచ్చితో జగన్ పాసుపుస్తకాలపై తమ బొమ్మ వేసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. నేడు రాజముద్రతో కూటమి ప్రభుత్వం రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.