• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

కాకినాడ రూరల్ 3వ డివిజన్ మూడు గుళ్ల కూడలి వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చిన కొండమూరి రాజు (45)గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

March 2, 2026 / 01:37 PM IST

కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జాయింట్ కలెక్టర్ సీ. విష్ణుచరణ్ స్వయంగా విన్నారు. భూ సమస్యలు, ఇతర సామాజిక పింఛన్ల వినతులను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 01:35 PM IST

గణపవరంలో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర

ELR: ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో కాదు ప్రజా క్షేత్రంలోకి వస్తే దోమల బెడద తెలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి గోపాలన్ అన్నారు. సీపీఎం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర సోమవారం గణపవరం మండలంలో గణపవరం, వరదరాజుపురం, అర్థవరం, ముగ్గళ్ళ, పిప్పర, చిలకంపాడు మీదుగా సాగింది. దోమల బెడద పడలేకపోతున్నామని ప్రజలు పాదయాత్ర బృందం ముందు వాపోయారు.

March 2, 2026 / 01:34 PM IST

పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలన

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 46వ డివిజన్ బృందావనం ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:33 PM IST

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే

E.G: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం నెలటూరులో రైతు సేవా కేంద్రం వద్ద కోకో రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదగా సబ్సిడీపై పనిముట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరిబాబు, AMC ఛైర్మన్ నాదేళ్ల శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:32 PM IST

రబ్బానీ కుటుంబానికి ఎమ్మెల్యే పులపర్తి పరామర్శ

W.G: భీమవరం ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ ఎస్.కే రబ్బానీ కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పరామర్శించారు. రబ్బానీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగపు ప్రసాద్, సయ్యద్ ఖాజా, బాషా, ఖలీల్, శబూ రబ్బానీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:30 PM IST

స్వామివారి నిత్య అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి కాకినాడ సిద్ధార్థ నగర్ వాస్తవ్యులు సానబోయిన నాగ రమేష్ కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

March 2, 2026 / 01:29 PM IST

జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు అందజేసిన కలెక్టర్

SS: జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో 2026-27 సంవత్సరానికి గాను జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ‘పుట్టపర్తి సమాచార్’ దినపత్రిక ఎడిటర్ గోగుల చక్రపాణికి అక్రిడిటేషన్ కార్డు అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.

March 2, 2026 / 01:28 PM IST

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్‌గా డా. స్మిత

అన్నమయ్య: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా (FAC) స్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సీసీఈ ఆదేశాల మేరకు సుధాకర్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్మిత తెలిపారు. త్వరలోనే విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకుంటానని పేర్కొన్నారు.

March 2, 2026 / 01:28 PM IST

‘విశ్రాంత భవనాలను అందుబాటులోకి తీసుకురావాలి’

కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి భవనాలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రమణ్యం సోమవారం జాయింట్ కలెక్టర్ నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోవిందు, భోగి రెడ్డి, సుభాని, కోటేశ్వరరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:27 PM IST

అంబులెన్సులో మగ బిడ్డ జననం

ASR: గుర్తేడు మండలం వేజువాడ గ్రామానికి చెందిన పాపాయమ్మ అంబులెన్సులో ప్రసవించింది. అంబులెన్సులో రంపచోడవరం ఆసుపత్రికి ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం అయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు పురుడుపోయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వైద్య పరీక్షలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామని సిబ్బంది తెలిపారు.

March 2, 2026 / 01:25 PM IST

ప్రైవేట్ లాడ్జీలలో తనిఖీలు.. గంజాయి స్వాధీనం

PPM: మన్యం పట్టణంలో ప్రైవేట్ లాడ్జీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించిన పట్టణ పోలీసులు ఒక లాడ్జిలో గంజాయి నిల్వఉంచినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సందర్భంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 01:23 PM IST

‘షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోండి’

VZM: భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని కోరారు. సోమవారం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికుల, ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, కనకరాజు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:22 PM IST

టీడీపీ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి అమరావతి గ్రౌండ్స్‌లో హనుమంతునిపాడు మండలం టీడీపీ పార్టీ నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, మండల స్థాయి సమస్యల పరిష్కారంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.

March 2, 2026 / 01:22 PM IST

‘వైసీపీ బలోపేతమే లక్ష్యం కావాలి’

SKLM: నరసన్నపేటలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా వైసీపీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని వైసీపీ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట వైసీపీ కార్యాలయంలో కమిటీ డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వైసీపీ బలోపేతం కోసం కమిటీలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు.

March 2, 2026 / 01:21 PM IST