• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రక్తదాన్ మహోత్సవ్ గోడపత్రిక ఆవిష్కరణ

W.G: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ నాగరాణి చేతుల మీదుగా రక్తదాన్ మహోత్సవ్ రక్తదాన అవగాహన కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన్ మహోత్సవ్ పేరిట ఒక నెలరోజులపాటు రక్తదాన అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

March 6, 2026 / 08:05 PM IST

వెంకటగిరిలో 9న జాబ్ మేళా

TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 9న వెంకటగిరిలోని విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. 13 కంపెనీలు పాల్గొని 895 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. యువత https://naipunyam.ap.gov.in⁠లో మార్చి 8లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 6, 2026 / 08:03 PM IST

మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీకి వినతి

W.G: ఆకివీడు శివారు తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పౌర సేవలు అందడం లేదని నేతలు పెంకి అప్పారావు, బీవీ వర్మ జేసీ దృష్టికి తీసుకెళ్లారు.

March 6, 2026 / 08:02 PM IST

పరిగిలో త్రాగునీటి సమస్యపై సమీక్ష

సత్యసాయి: పరిగి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఎంపీడీవో రెడ్డప్ప ఆధ్వర్యంలో మండల అధికారులు, స్థానిక నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి నీటి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

March 6, 2026 / 08:02 PM IST

పోలీస్ సిబ్బందికి వృత్తి నైపుణ్యం అవసరం: SP

కోనసీమ: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా SP రాహుల్ మీనా శుక్రవారం పెద్దాపురం వద్దనున్న జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో ఘనంగా ప్రారంభించారు. SP స్వయంగా SLR, AK 47, పిస్టల్‌తో లక్ష్యాన్ని ఛేదించి ఫైరింగ్ శిక్షణను మొదలుపెట్టారు. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ అనుభవం ఎంతో దోహదపడుతుందన్నారు.

March 6, 2026 / 08:00 PM IST

పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన

ATP: రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు, నేర కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు తీసుకునే చర్యలు గురించి విద్యార్థులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్‌పై అవగాహన కల్పించారు.

March 6, 2026 / 08:00 PM IST

ఈనెల 8న ములుమూడి కలుజు‌పై బ్రిడ్జికి శంకుస్థాపన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ములుమూడి కలుజు‌పై బ్రిడ్జికి ఈనెల 8న ఉదయం 9:00 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేస్తారని తెలిపారు.

March 6, 2026 / 08:00 PM IST

ఏస్సైగా పదోన్నతి పొందిన నరసింహ రావు

E.G: కడియం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీ.నరసింహ రావు ఏస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేషన్ సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఆయన 36 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా, హెడ్ కానిస్టేబుల్‌గా పలు సేవలు అందించినట్లు సీఐ తెలిపారు.

March 6, 2026 / 08:00 PM IST

పాఠశాలలను సందర్శించిన డీఈవో నాగేశ్వరరావు

కాట్రేనికోన, చెయ్యరు జడ్పీ ఉన్నత పాఠశాలలను అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించి విద్యార్థులకు ఉన్న సామర్ధ్యాల గురించి వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు పోటీ తత్వంతో చదవాలన్నారు.

March 6, 2026 / 08:00 PM IST

‘దళితుల ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు’

SKLM: ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీయటానికి అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయని ఇచ్చాపురం నియోజకవర్గ దళిత సంఘ నాయకులు దడ్డ చంద్రశేఖర్, బాగా మోహనరావులు తెలిపారు. ఇచ్చాపురంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. అన్ని పార్టీలు మాల సామాజిక వర్గాన్ని దోపిడీదారులుగా చిత్రీకరించి దళిత ఐక్యతను దెబ్బతీస్తున్నారని వాపోయారు.

March 6, 2026 / 07:58 PM IST

ఆధార్ అప్‌డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్

PLD: చిలకలూరిపేటలోని BSNL కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సుబ్బయ్య తోట నివాసి నాయుడు శివ ఆరోపించారు. శుక్రవారం పేరు అప్‌డేట్ చేయించేందుకు వెళ్లగా,అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ నగదు అడిగారని ఆయన పేర్కొన్నారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివ,వెంటనే బిఎస్ఎన్ఎల్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

March 6, 2026 / 07:55 PM IST

అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

NTR: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.

March 6, 2026 / 07:55 PM IST

యూనిక్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

NTR: నందిగామ మండలం అంబర్‌పేట గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ప్రసాద్‌రావు యూ ఎఫ్ సర్వేను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుంచి వచ్చిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.

March 6, 2026 / 07:52 PM IST

బొత్స సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం విజయవాడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

March 6, 2026 / 07:50 PM IST

CMRF చెక్కును పంపిణీ చేసిన ఇంఛార్జ్

ప్రకాశం: దర్శిలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన యనమల శ్రీను అనారోగ్య రీత్యా బాధపడుతున్న విషయం తన దృష్టికి రాగా.. రూ.1,61,355ల ఎల్వోసీ చెక్కును బాధితుడికి అందజేసినట్లు తెలిపారు. ఇదే విధంగా పార్టీ అభిమానులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

March 6, 2026 / 07:48 PM IST