NDL: దొర్నిపాడు మండలంలోని 8,400 ఇళ్లలో 7,200 ఇళ్ల నుంచి 85% పన్నులు వసూలు చేసినట్లు ఎంపీడీవో సావిత్రి గురువారం తెలిపారు. అమ్మిరెడ్డి నగరంలో 95% వసూలు పూర్తయినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.11 లక్షలు సేకరించగా, మార్చి చివరి నాటికి మొత్తం వసూలు పూర్తి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
NLR: ఏఎస్ పేట మండలంలోని అనుమసముద్రం గ్రామంలో ఓ వింతైన సాలీ పురుగు చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఇంటి ఆవరణలో వేలాడుతూ కనిపించిన ఈ సాలీ పురుగు చూసేందుకు వైవిధ్యమైన రూపంలో ఉండడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. గోధుమ రంగులో ఉన్న పురుగును నిశితంగా పరిశీలిస్తే మనిషి రూపాన్ని పోలి వింతగా ఉండడం విశేషం.
కోనసీమ: రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సుధా వెంకటస్వామి నాయుడు నియమితులయ్యారు. దీనికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీలో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాయుడుకి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.
TPT: TTD ఈవోగా ముద్దాడ రవిచంద్ర ఇవాళ ఉదయం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్ తదితర టీటీడీ అధికారులు రవిచంద్రకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
SKL: పాతపట్నంలోని మహేంద్ర తనయ నదిపై హెవీ బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అలాగే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో వెండి, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అష్టోత్తర శతనామావళి పఠించారు.
AKP: ఎస్ఈజెడ్ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో బార్క్ భూసేకరణకు సంబంధించి 15 ఏళ్లయిన నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఆర్.ఆర్. ప్యాకేజ్‌లో కాలనీలు ఇప్పటివరకు సిద్ధం కాకపోవడంతో వారిని తరలించలేకపోతున్నామన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేక RTC బస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ RTC RMను ఆదేశించారు. ఒంటిమిట్టలో జరిగిన సమీక్షలో ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ మాట్లాడారు. కడప రైల్వే స్టేషన్ నుంచి భక్తులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గత బ్రహ్మోత్సవాలకు 145 బస్సులు ఏర్పాటు చేసినట్లుగా RTC RM కలెక్టర్కు తెలిపారు.
ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొమరోలు, అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియం పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. అలాగే కంభం, గిద్దలూరు మండలాల్లో కొత్త స్టేడియాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో న్యాయ శాఖలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్ధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ద్వారా సందర్శించవచని తెలిపారు.
W.G: గుంటూరులో న్యాయవాది చెన్నకేశవపై జరిగిన దాడిని నిరసిస్తూ మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు. న్యాయవాదులపై దాడులు దారుణమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
TPT: తిరుపతి కొర్లగుంటకు చెందిన రాజేంద్ర తిరుమల కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళం ఏరియాకు చెందిన ఓ మహిళ వద్ద రూ. 15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 2022లో అతను ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి రాజేంద్రకు 6నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ELR: నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్’ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ పి. రజిత గురువారం తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు కళాశాల పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
అన్నమయ్య: కొత్తపల్లి మాండవ్య నది తీరాన ఉన్న మల్లూరమ్మ ఆలయ ఈవో కొండారెడ్డిని దేవదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం,అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ రామచంద్ర మోహన్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు, భక్తుల ఫిర్యాదులపై విచారణ చేపట్టగా, విచారణ పూర్తయ్యే వరకు శివయ్యను ఇన్‌ఛార్జ్ ఈవోగా నియమించారు.
CTR: సదుం MRC వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ(90) దయనీయ జీవితం గడుపుతోంది. ఓటర్ కార్డు ఉన్నా రేషన్, ఆధార్ కార్డు లేక ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా తిండి పెడితే తింటూ ఇబ్బందులు పడుతోంది. పింఛన్ మంజూరు చేస్తే తనకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఆమె వేడుకుంటోంది. అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చేయాలని పలువురు కోరుతున్నారు.