E.G: శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్సీలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. శాసనసభలో ఒక సభ్యుడిపై ఇలాంటి దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.
KDP: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సీపీఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలులోని భగత్ సింగ్ నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల వెనుక జలాల జీవోకు రూ.100 కోట్లు కేటాయించి గోపవరం, అట్లూరు, బద్వేల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.
KDP: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సీపీఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలులోని భగత్ సింగ్ నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల వెనుక జలాల జీవోకు రూ.100 కోట్లు కేటాయించి గోపవరం, అట్లూరు, బద్వేల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.
నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ, పొన్నాపురం ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల స్థాపన పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గి, ఆర్థికంగా మేలు చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.
అన్నమయ్య: అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను 2009 ప్రకారం 1వ తరగతిలో ఉచితంగా చేరెందుకు ప్రవేశాలకు ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట మండల విద్యాశాఖ అధికారులు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు వారు రాజంపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు.
VZM: కొత్తవలస మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై కమిటీ డైరెక్టర్లతో కలిసి ఆమె సుదీర్ఘంగా చర్చించారు. మార్కెట్ కమిటీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు పాలకమండలి సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించారు.
SKLM: గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కూడా ఛైర్మన్ కొరికానా రవికుమార్ కోరారు. శుక్రవారం మెలియాపుట్టి మండలంలోని చాపర కళ్యాణమండపంలో జనసేన సభ్యత్వాల గూర్చి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాలలో పర్యటించి జనసేన సభ్యత్వాలు చేయించాలని సూచించారు. ఆయనతోపాటు జనసేన నాయకురాలు కొరీకాన భవాని ఉన్నారు.
AKP: మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొండవీటి, కామకోటం గ్రామాల్లో జీడి రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. జీడిపిక్కకు కేజీ రూ.200 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తా రూ.18వేలకు మద్దతు ప్రకటించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా జీడి తోటల అభివృద్ధి చేయాలన్నారు.
AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లలో 80 శాతంతో నక్కపల్లి మండలం మొదటి స్థానంలో ఉన్నట్లు డీఎల్డీవో నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో చంద్రశేఖర్‌తో కలిసి స్పెషల్ నిర్వహించారు. మార్చి 15 లోగా శత శాతం ఇంటి పనులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రత్యూష రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరానన్నారు. ఆమెకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన మాట నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకుడిని గౌరవంగా చూసుకునే బాధ్యత తనదేనని కోటంరెడ్డి చెప్పారు.
TPT: రేణిగుంట మండలం అడుసుపాలెం జగనన్న లేఅవుట్‌లో గుర్తుతెలియని మహిళ మృత చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఉరివేసుకుని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: మనుబోలులోని ప్రభుత్వ ఆసుపత్రిని DMHO సుజాత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తప్పనిసరిగా నెలకు 10 కాన్పులు చేయాలని సూచించారు. సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వచ్చేలా కృషి చేయాలన్నారు. సీహెచ్వో రాజయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు.
KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం పాలకేంద్రాన్ని డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాల కేంద్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాలు పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
CTR: నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం పాదిరి గ్రామంలో శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణుల దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు . ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాకు ఘనంగా స్వాగతం పలికారు.
ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏ ఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగును, వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.