ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీవో కేశ్వర్థన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా సవరణ, మ్యాపింగ్ ప్రక్రియపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల వివరాలను 2025 జాబితాతో అనుసంధానం చేసే (Mapping) కీలక ప్రక్రియ కొనసాగుతోందని, దీనికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
PPM: సీతానగరం మండలం జోగింపేట కేజీబీవీ హాస్టల్ విద్యార్దినీలకు MLHPలోకేశ్వరి శనివారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెమోగ్లోబిన్, జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తగినంత నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
VZM: వంగర ఎంపీడీవో కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు శనివారం స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వలన భూగర్భ జలాలు పాడైపోతున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని డిప్యూటీ ఎంపీడీవో రామారావు కోరారు.
కోనసీమ: తిరుమల లడ్డూ కల్తీ అంశంలో పట్టుబడి వైసీపీ తప్పుల మీద తప్పు చేస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆరోపించారు. శాసనమండలిలో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు అపచారంపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం రావులపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఈనెల 25వ తేదీన ఎల్లమ్మ జాతర జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ లెంక రామలక్ష్మి, సత్యనారాయణ దంపతులు తెలిపారు. ఎల్లమ్మ పూజారి రుద్రాక్షల సత్యం, పరశురామున్న పూజారి కర్ణకోట కసవయ్యలు సిరిమాను అధిరోహిస్తారని చెప్పారు. 24న తోలేల ఉత్సవం, 26న కనుము జరుపుతారని తెలిపారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి అనంతరం జరుగుతుందన్నారు.
PPM: కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తోట శంకరరావు మాట్లాడుతూ.. భాషల వైవిధ్యాన్ని కాపాడటం, మాతృభాషపై గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలిపారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలో నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ అధికారులతో MLA సమావేశమై మాట్లాడారు. గ్రామాల వారీగా కొత్తగా విద్యుత్ పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు తదితర విద్యుత్ సమస్యల కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలన్నారు.
VZM: బొబ్బిలి MLA బేబినాయన శనివారం స్దానిక MPDO కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు ఎర్పాటు చేసిన స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన పెంచడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఈ రథం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం స్వచ్ఛంగా ఉండేలా ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకులో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి అధికారులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని అధికారులకు సూచించారు. అవసరానికి మించి యూరియా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడపత్రాన్ని ఆవిష్కరించారు. అగ్రికల్చర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంCH పోతేపల్లికి చెందిన యర్రంశెట్టి యేసు – ఝాన్సీ రాణి దంపతులకు పుట్టిన 10 రోజుల పసిబిడ్డ ఊపిరితిత్తులు అభివృద్ధి చెందక ప్రాణాపాయ స్థితిలో ఉంది. చాలాఖర్చవుతుందని వైద్యులుతెలపడంతో ఆ కుటుంబం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్నిఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా శనివారం రూ.3,02,729 ఎల్ఓసీ మంజూరు చేయించారు.
SKLM: ఆమదాలవలస మండలం తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డా. జి. రవికుమార్ మాట్లాడుతూ భావ వ్యక్తీకరణకు మాతృభాష కీలకమని, ప్రపంచ భాషలలో తెలుగు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.
W.G: భీమవరం సివి రామన్ స్కూల్లో శనివారం శ్రీవిజ్ఞాన వేదిక చార్టిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి., గోపాలశర్మ, డాక్టర్ రంగరాజు మాట్లాడుతూ.. భాషా వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసమే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరాజు, నాగేశ్వరరావు,శర్మ, రాజబాబు,బాషా, పాల్గొన్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, అవసరమైన సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి ఇవాళ వెల్లడించారు.
VZM: తెర్లాంకి చెందిన శనపతి రాము కుమార్తె జ్ఞానవర్షిణికు మంజూరైన సీఎం సహాయ నిధి రూ.1,00,000 చెక్కును ఎమ్మెల్యే బేబినాయన అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదం చేస్తుందని బేబినాయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
CTR: స్వచ్ఛతపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్వచ్ఛ రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూతలపట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుమారి ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీవో నాగరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.