• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. జవాన్ మృతి

VZM: గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద ఇవాళ గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టడంతో ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అతన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన వ్యక్తిగా అని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 10:00 AM IST

నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

ASR: అరకు రైల్వే ఆస్పత్రిలో నేడు ఉచిత క్యాన్సర్ స్క్రీ నింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఆస్పత్రి పీఆఓ్వ పీ.ఆనంద్ తెలిపారు. విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే హెల్త్ యూనిట్, ఆరిలోవ మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ వారు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. శిబిరంలో బీపీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాప్ స్మియర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.

February 26, 2026 / 10:00 AM IST

కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం వన్నాం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. చేతికందొచ్చిన పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 26, 2026 / 10:00 AM IST

జిల్లా ఇంఛార్జ్ కమిషనర్‌గా రాకేశ్ చంద్ర

కడప నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్‌గా, ప్రస్తుత అడిషనల్ కమిషనర్‌గా ఉన్న రాకేశ్ చంద్రను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో రాకేశ్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 10:00 AM IST

దేవాలయ భూములను సంరక్షించాలి: ఎమ్మెల్యే

KRNL: దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటిని అన్యాక్రాంతం చేసే హక్కు ఎవరికీ లేదని ఆదోని MLA పార్థసారధి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆలయ భూములను లీజులు, స్టేడియాలకు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ప్రభుత్వం కాపాడాలని, ధార్మిక సంస్థల అభిప్రాయాలతో సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 09:56 AM IST

మెడకు తగిలిన కేబుల్ వైర్లు.. తప్పిన ప్రాణాపాయం

W.G: సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

February 26, 2026 / 09:50 AM IST

విశాఖకు రూ. 32,373 కోట్ల రుణ లక్ష్యం

VSP: నాబార్డ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 32,373 వేల కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ఆవిష్కరించారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 వేత కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని బ్యాంకులకు సూచించారు.

February 26, 2026 / 09:45 AM IST

రూ. 1.78 లక్షల రికవరీకి ఆదేశం

CTR: బైరెడ్డిపల్లె మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి ఆడిట్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద మీటింగ్ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, రికార్డులు సక్రమంగా లేకపోవడం, దాదాపు రూ. 1.78 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

February 26, 2026 / 09:41 AM IST

నెల్లూరులో ఎన్నికలు.. TDP, YCP బలాలు ఇలా.!

NLR: నెల్లూరు మేయర్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. కూటమి అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరు ప్రకటించారు. 54 డివిజన్లలో ఓ కార్పొరేటర్ రాజీనామా చేయగా 53మంది ఉన్నారు. 39మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా.. వేమిరెడ్డి, కోటంరెడ్డి, నారాయణ ఎక్స్‌అఫీషియో ఓట్లతో కూటమి బలం 42గా ఉంది. వైసీపీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఓటు, 14 మంది కార్పొరేటర్లు ఉండటంతో వారి బలం 15గా ఉంది.

February 26, 2026 / 09:40 AM IST

వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NTR: విజయవాడలో AB కన్వీన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఈరగాబి రమణారావు కుమార్తె, వివాహ రీసెప్సషన్ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:36 AM IST

వాడపల్లి నిత్యాన్నదాన పథకానికి విరాళం

ASR: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి విజయవాడ ప్రసాదంపాడు వాస్తవ్యులు గంధం రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.5,00,001 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

February 26, 2026 / 09:36 AM IST

శ్రీ భోగేశ్వర స్వామి హుండీ లెక్కింపు ఆదాయం

ATP: పామిడి శ్రీ భోగేశ్వర స్వామి ఆలయంలో భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కింపు చేశారు. ఆలయ ఈవో కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 28 నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు భక్తాదులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కించగా రూ.1,58,811నగదు,3 గ్రాముల బంగారం, 94 గ్రాముల వెండి వచ్చిందని వారు మీడియాకు తెలిపారు.

February 26, 2026 / 09:36 AM IST

‘పదివేల సభ్యత్వాల నమోదు లక్ష్యం’

SKLM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని నరసన్నపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బలగ ప్రవీణ్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. గతంలో 3300 సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. అధినేత ఆదేశాల మేరకు మార్చి పదో తేదీ లోగా 10 వేల సభ్యత్వాలు లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని వివరించారు.

February 26, 2026 / 09:30 AM IST

మదనపల్లెలో పోలీసుల కార్డెన్ సెర్చ్

అన్నమయ్య: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 150మంది పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, ఎస్టీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో రంగంలోకి దిగారు. కాట్లాటపల్లి, రోడ్డు, రామిరెడ్డిలేఔట్లో ప్రతి ఇంటిని పరిశీలించారు. 20 బైక్లను సీజ్ చేశారు.

February 26, 2026 / 09:30 AM IST

మానవత్వం చాటుకున్న అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ

KRNL: అస్వస్థతతో మృతి చెందిన గుర్తుతెలియని అనాధ వ్యక్తికి పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ఎమ్మిగనూరు (మం) గోనెగండ్ల బైపాస్ రోడ్ హిందూ స్మశాన వాటికలో పూలమాలలు వేసి అంతక్రియలు పూర్తి చేశారు. సింగనేటి నరసన్న మహారాజ్ ఆధ్వర్యంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:30 AM IST