కడప నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్గా, ప్రస్తుత అడిషనల్ కమిషనర్గా ఉన్న రాకేశ్ చంద్రను నియమిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డిని ప్రభుత్వం సరెండర్ చేయడంతో ఆయన స్థానంలో రాకేశ్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.