E.G: మాజీ మంత్రి అంబటి రాంబాబును YCP నేత మేడపాటి షర్మిల రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, ఎస్సీ నాయకుడు కాటం సంజయ్ కాంత్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.
SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేశారు. ఎంఎస్ఎంఈ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.
తిరుపతిలోని APSPDCL సీఎండీ కార్యాలయంలో “వెంకటపతి విద్యా దీవెన” పేరుతో పేద, వెనుకబడిన వర్గాల యువతకు రాష్ట్ర, కేంద్ర సివిల్ సర్వీసుల కోసం మూడేళ్లపాటు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురకు వినుకొండలో, బాలికలకు కేతనకొండ (విజయవాడ)లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.
కోనసీమ: అమలాపురం ఇంచార్జి ఆర్డీవోగా జేసీ టి.నిశాంతి బాధ్యతలు అప్పగించారు. రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం ఆర్డీవోలు బదిలీ కావడంతో వారి స్థానాల్లో ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట, రామచంద్రాపురం ఇంచార్జి ఆర్డీవోగా జిల్లా సర్వ శిక్షా ఏపీసీ జీ.మమ్మీ కి బాధ్యతలు అప్పగించారు.
BPT: సూర్యఘర్ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ వినోద్‌కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో 24,620 యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని 45 గోదాముల్లో ఇప్పటికే 20 పూర్తయ్యాయని, మిగిలిన వాటి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవానిని పార్టీ అధిష్ఠానం బుధవారం నియమించింది. శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వాల నమోదు కోసం ఏడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించామని పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రవికుమార్ తెలిపారు.
PPM: జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై వివరించారు.ఈ పర్యటనలో జిల్లా అధికారులు, నీతి అయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో APSPDCL అధికారులు, సోలార్ వెండర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన 9 పనుల్లో 4 పనులకు స్థలాలు ఖరారు కాగా, మిగిలిన పనులకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
KDP: అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఉదయశ్రీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
KRNL: ఈనెల 25 నుంచి మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 ప్రక్రియను అమలు చేస్తున్నట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి బుధవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో మార్కెట్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.
VZM: పని ప్రదేశంలో నీరు, మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలని APO సాయిరాం సూచించారు. బుధవారం బాడంగి మండలం ఉపాధిహామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామ పంచాయతీలో పనులు కల్పించాలని,100 రోజుల ప్రగతిపైన FAలపైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు వేతన శ్రామికులతో దగ్గరుండి పని చేయించి దినసరి కూలీ 300 వచ్చే విధంగా చూడాలన్నారు.
NLR: కలిగిరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు బుధవారం చెత్త సేకరణ బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, సమర్థవంతమైన పారిశుధ్య నిర్వహణ కోసం ఈ బండ్లు, డస్ట్ బిన్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణానికి పంచాయతీల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
KKD: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 26 మంది ఆర్డీవోలను అమరావతి జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. కాగా బదిలీ అయిన వారిలో కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, అమలాపురం ఆర్డీవో కే.మాధవి ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రకాశం: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు చూడాలని సూచించారు. వాది, ప్రతివాదులకు లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని ఆమె కోరారు.
ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగజ్యోతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు.