• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారానికి ఆదేశం: కలెక్టర్

W.G: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ జీ. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 262 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:00 PM IST

‘కార్యక్రమాల గురించి రాహుల్ ఆరా’

ప్రకాశం: వికారాబాద్‌లోని ఓ రిసార్ట్స్ లో జరుగుతున్న ఏపీ & తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ శిక్షణ శిబిరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవ్వగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యక్రమాల గురించి జిల్లా అధ్యక్షులు షేక్ సైదా‌ను అడిగి తెలుసుకున్నారు. సంస్థ గత నిర్మాణాల గురించి రాహుల్‌కు వివరించారు.

March 2, 2026 / 07:00 PM IST

కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఎస్.హెచ్.ఓ (SHO)లు, పోలీస్ సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు.

March 2, 2026 / 07:00 PM IST

‘పూర్తి దర్యాప్తు చేపట్టాలి’

ASR: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంత కుమారి కోరారు. ఈమేరకు సోమవారం బీజేపీ జనతా వారధి కన్వీనర్ మినుముల గోపాలపాత్రుడు తదితరులతో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్‌కు వినతిపత్రం అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో, లిక్కర్ పాలసీలో భారీ ఆర్ధిక కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

March 2, 2026 / 06:59 PM IST

మహిళల భద్రతపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు

CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, చిత్తూరు II టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నెట్టికాంతయ్య వరదప్ప నాయుడు పాఠశాలలో మహిళల భద్రత అనే అంశంపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 06:52 PM IST

ఎమ్మెల్యే ముప్పిడి దృష్టికి క్రైస్తవుల సమస్యలు

E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బిషప్ కౌన్సిల్ మెంబెర్స్ సోమవారం కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో క్రైస్తవుల రక్షణ బాప్తీస్మము పొందుటకు గోదావరి నది ఒడ్డున స్థలము కేటాయించాలని, క్రైస్తవులకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరుతూ వినతి పత్రం అందించారు. వాటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

March 2, 2026 / 06:50 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు

NLR: ఆత్మకూరు మండలం బట్టేపాడు సొసైటీ భవనంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం గిట్టుబాటు ధర కల్పిస్తూ వెంటనే నగదు చెల్లింపు కూడా చేస్తామని రైతులకు అధికారులు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుంది అని అధికారులు పేర్కొన్నారు.

March 2, 2026 / 06:50 PM IST

ప్రమాద అంచుల్లో పాఠశాలకు ప్రయాణం

VZM: డెంకాడ మండలంలో పాఠశాలకు వెళ్లడానికి ప్రమాదపు అంచుల్లో విద్యార్థులు ప్రయాణం సాగిస్తున్నారు. చింతలవలస నుంచి అక్కివరం వెళ్ళే రోడ్డులో ఆటోకు బ్యాగ్‌లను తగిలించి నిర్లక్ష్య దోరణిలో పిల్లలను తీసుకువెళ్తున్నారు. అయితే, ఈ మార్గంలో భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. స్కూల్ పిల్లల ఆటోలపై పోలీసులు, ఆర్టీవో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

March 2, 2026 / 06:50 PM IST

హనుమంతరాయ చౌదరిని పరామర్శించిన జేసీ

ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

March 2, 2026 / 06:42 PM IST

కువైట్లో జిల్లా వాసి మృతి

W.G: పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు.

March 2, 2026 / 06:40 PM IST

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు మండలంలోని రాజోలు, ములికిపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన పాల్గొని గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

March 2, 2026 / 06:40 PM IST

‘కొవ్వూరు నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి’

E.G: కొవ్వూరు నియోజవర్గంలోని దళితలకు ఉచితంగా సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, DSC కొరకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కోరింది. ఈ మేరకు సోమవారం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారిని శాఖ సభ్యులు పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్, విజయానంద కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

March 2, 2026 / 06:38 PM IST

‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి’

PPM: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను ఉగాది నాటికి సాధించాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 34,965 గృహాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 20,859 గృహాలు పూర్తయ్యాయన్నారు.

March 2, 2026 / 06:36 PM IST

బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రజా వేదికలో 135 అర్జీలు

BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 135 అర్జీలు అందాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీలను 24 గంటల్లోనే పరిష్కరించి బాధితులకు తక్షణ ఊరట కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

March 2, 2026 / 06:35 PM IST

మన శివశంకర వరప్రసాద్ అర్థశత దినోత్సవ వేడుక సంబరాలు

VZM: మన శంకర వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలను నగరంలోని హిమగిరి థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా సెలబ్రేషన్స్‌లో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

March 2, 2026 / 06:35 PM IST