BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 135 అర్జీలు అందాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీలను 24 గంటల్లోనే పరిష్కరించి బాధితులకు తక్షణ ఊరట కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.