ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ షర్మిల ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ గ్రామ సర్వే నెంబర్స్ 2, 14, 15, 16, 17 లోని సబ్ డివిజన్ భూములకు రీసర్వే ఉంటుందన్నారు. రైతులు అధికారులకు అందుబాటులో ఉండి సహకరించాలని ఆమె కోరారు.
W.G: భీమవరంలో సీపీఎం ఆధ్వర్యంలో 25వ రోజు ప్రజా చైతన్య పాదయాత్ర మావుళ్ళమ్మ ఆలయం నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేత వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. టిడ్కో గృహాల లబ్ధిదారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని మండిపడ్డారు. ఉగాది పండుగ గడిచినా ఇళ్ల పంపిణీలో వైఫల్యం చెందారని విమర్శించారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
KDP: గంజాయి రవాణాను అరికట్టేందుకు ‘ఆపరేషన్ వజ్రపహార్’లో భాగంగా మైదుకూరులో ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అర్బన్ సీఐ కె. రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ట్రాన్స్‌పోర్ట్, పార్శిల్ సర్వీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి. అనుమానాస్పద పార్శిల్స్ వస్తే లేదా గంజాయి రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యజమానులను ఆదేశించారు.
ELR: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారును పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి మండలంలో తనిఖీలు నిర్వహించినట్టు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు. బహిరంగంగా మద్యం తాగుతున్న ఇద్దరిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు. బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను నేరుగా 9154790350 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: గత రాత్రి అమలాపురం పట్టణ CI వీరబాబు ,పట్టణ ఎస్సైలు కిషోర్ బాబు, శ్రీనివాసు, సిబ్బంది అందరూ కలిసి ఫ్లాగ్ మార్చ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. వేసవికాలంలో రాత్రిపూట అనుమానిత వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండమని, అనుమానించే వ్యక్తులు సంఘటనల గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
NLR: సంగం గురుకుల పాఠశాల వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబై హైవేపై వెళ్తున్న సిమెంట్ లారీకి అడ్డుగా ఓ వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో సిమెంట్ లారీ ఎర్ర చెరువులోకి దూసుకెళ్లింది. ఒకవేళ ట్యాంకర్ ఎడమ వైపునకు మళ్లి ఉంటే ఇళ్లపైకి దూసుకెళ్లి పెను ప్రమాదం జరిగి ఉండేదని, కుడి వైపునకు మళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. వైసీపీ రాక్షస పాలనలో నాయకులు, కార్యకర్తలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే టీడీపీ విజయం చేకూరిందని ఆయన తెలిపారు.
VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామ సమీప తోటల్లో జూద శిబిరంపై ఆదివారం సాయంత్రం SI సాగర్ బాబు దాడి చేశారు. జూదం ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.42,420 నగదును, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పరిసరాల్లో పేకాట ఆడిన, ఆడటానికి ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామంలోని నాపరాతి గనుల్లో నిర్వహిస్తున్నపేకాట స్థావరంపై ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9,500 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
KRNL: ఆదోని పట్టణ శివారులోని ఇస్వీ కొండల్లో ఆదివారం పోలీసులు ఒక జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్సై మహేష్ కుమార్ నేతృత్వంలోని బృందం 9 మంది జూదరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి రూ.17,000, 7 సెల్ ఫోన్‌లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. బోయ గోవిందరాజులు, బోయ పరశురాంలతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు.
అనకాపల్లి కూరగాయల మార్కెట్‌లో వర్తకులు స్థానిక రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం కూరగాయల మార్కెట్‌ను సందర్శించి స్థానిక వర్తకులతో మాట్లాడారు. వర్తకుల, రైతుల సమస్యలపై చర్చించారు. స్థానిక రైతుల నుంచి టమోటాలు కొనుగోలుకు వర్ధకులతో ఒప్పందం కుదిర్చారు.
VSP: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను మొత్తం 5,465 ఎకరాల్లో 2 దశల్లో పూర్తి చేయనున్నారు. ప్లాంట్ నుంచి ఏడాదికి 17.8 MMT ఉక్కు ఉత్పత్తి కానుంది.
KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నేడు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు APSPDCL CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తిరుపతి సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ సమయంలో 8977716661 నెంబరుకు ఫోన్ చేసుకోవచ్చు అన్నారు.