• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు మీడియా ప్రతినిధులకు ఉచిత వైద్య శిబిరం

బాపట్లలో ఈ నెల 24న ఉదయం 8.30 గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ఉచిత వైద్యశిబిరాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వైద్య నిపుణులు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందజేస్తారు. మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 23, 2026 / 07:24 AM IST

నేడు ఆశీల వేలం పాట

SKLM: పాతపట్నం మేజరు పంచాయతీకి సంబంధించిన ఆశీల వేలం పాట సోమవారం జరగనుంది. పాటలో పాల్గొని హక్కులు పొందొచ్చని పంచాయతీ కార్యదర్శి వి.రామచంద్రరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్ చెల్లించి ఈ వేలంలో పాల్గొనవచ్చునని పిలుపునిచ్చారు. పాతపట్నం పంచాయతీ ఆఫీస్‌లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 23, 2026 / 07:24 AM IST

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌పై కలెక్టర్ ఉక్కుపాదం

ATP: వినియోగదారులకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 50 గ్యాస్ ఏజెన్సీలలో వీఆర్వోలు అందుబాటులో ఉండి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

March 23, 2026 / 07:20 AM IST

ముగిసిన ఉగాది నాటకోత్సవాలు..!

W.G: తాడేపల్లిగూడెం బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఉగాది నాటకోత్సవాలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్.డీ. విల్సన్ శరత్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళలను, కళాకారులను ఆదరించాలని, తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వెలసిల్లుతాయన్నారు. అనంతరం ఆయనను సన్మానించారు.

March 23, 2026 / 07:18 AM IST

కార్గో ఎయిర్‌పోర్టు నిర్వాసితులతో కేంద్ర మంత్రి ముఖా ముఖి

SKLM: కార్గో ఎయిర్‌పోర్టుపై అపోహలు వద్దని నిర్వాసితులతో కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడు అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్వాసిత 18 గ్రామాల ప్రజలు, నిర్వాసితులతో ఆదివారం కలెక్టరేట్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎస్పీ, కలెక్టర్ సమక్షంలో కేంద్ర మంత్రి వర్చ్యువల్ గా నిర్వాసితుల సందేహాలు తీర్చినట్లు అధికారులు తెలిపారు.

March 23, 2026 / 07:14 AM IST

ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..?

SKLM: అరసవల్లి శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ.6.86 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNVD.ప్రసాద్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు.

March 23, 2026 / 07:14 AM IST

నేడు జిల్లాకు రానున్న డిప్యూటీ సీఎం

VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

March 23, 2026 / 07:14 AM IST

ప్రమాదాల నివారణకు ‘రేడియం’రక్షణ

ELR: తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన డబ్బాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. రాత్రి వేళల్లో ఈ స్టిక్కర్లు మెరుస్తూ.. వాహనదారులను అప్రమత్తం చేస్తాయని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు రవాణా నిబంధనలు పాటిస్తూ.. అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

March 23, 2026 / 07:13 AM IST

నేడు కలక్టరేట్లో PGRS , రెవెన్యూ క్లినిక్

VZM: కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారం కోసం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి నిన్న తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని, భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నెంబర్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

March 23, 2026 / 07:12 AM IST

నేడు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం

నెల్లూరులో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.రాఘవేంద్రం తెలిపారు. 0861 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలిపితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

March 23, 2026 / 07:09 AM IST

గడ్డి ముందు తాగిన వ్యక్తి మృతి

AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.

March 23, 2026 / 07:04 AM IST

గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.

March 23, 2026 / 07:04 AM IST

బర్రెలకు తప్పిన ప్రమాదం

TPT: కోట హరిజనవాడలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నకేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బర్రెల దొడ్డి పక్కన పిల్లలు టపాకాయలు పేల్చడంతో నిప్పురవ్వలు గడ్డివాముపై పడి మంటలు చెలరేగాయి. ఎండాకాలం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే బర్రెలను బయటకు తీసి రక్షించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 23, 2026 / 07:04 AM IST

గోట్లూరులో పరుగు పందెం పోటీలు

శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరులో ఈనెల 27న పరుగు పందెం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చు. 2 కిలోమీటర్ల ఈ పోటీలో విజేతలకు రూ. 5016వేల నుంచి రూ.1016 వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి గల వారు ముందే పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 23, 2026 / 07:00 AM IST

‘భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’

AKP: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డొక్కా సీతమ్మ భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. ఆదివారం అనకాపల్లి విదసం కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2013 ఆహార భద్రతలో భాగంగా అమలు చేస్తున్న భోజన పథకాన్ని అపహాస్యం చేశారన్నారు.

March 23, 2026 / 06:53 AM IST