CTR: వెదురుకుప్పం మండలం పాత గుంట గ్రామంలో జోరుగా సాగిన జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన కోడెద్దులు పగలంతా కాసిన ఎండకు అలసిపోయాయి. ముగింపు సమయంలో గంతులేసుకుంటూ సమీపంలోని మారేపల్లి చెరువులో తాగునీటికి వెళ్లి మూడు ఎద్దులు దుర్మరణం చెందాయి. ఈ ఘటన యజమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన కోసం తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం సోమవారం ఇక్కడికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడ వీధులు, కాలిబాటలు, విశ్రాంతి భవనం, కల్యాణ వేదిక ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం సమీక్ష నిర్వహించనున్నారు.
WG: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యత, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పెనుగొండ ఎస్సై గంగాధరరావు ప్రయాణికులను హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అది ప్రమాదంలో రక్షిస్తుందని అన్నారు.
AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ చేరుకుంటారు. 5:30 గంటలకు సీఎం చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ వెళతారు.
ATP: జిల్లా పట్టుపరిశ్రమ ఉద్యోగుల పరపతి సంఘం ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడు డైరెక్టర్ల స్థానాలకు 237 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 6న నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
TPT: సూళ్లూరుపేటలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో నేడు పుష్కర కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరుకానున్నారు. భక్తి శ్రద్ధల మధ్య జరిగే ఈ వేడుకకు స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.
VSP: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దుకాణాలు ఏర్పాటు చేయడానికి తూర్పు కోస్తా రైల్వే టెండర్లు ఆహ్వానించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు. ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు, అల్పాహారం, తినుబండారాలు, ఫాస్ట్‌ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, న్యూడిల్స్ వంటి స్టాల్‌లు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 30లోగా టెండర్లు దాఖలు చేయాలన్నారు.
VZM: పోలీసు సిబ్బంది తరుచూ తమకు కేటాయించిన దత్తత గ్రామాలను సందర్శించాలని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఆదివారం ఆయన ఎస్.కోట, కొత్తవలస పోలీసు స్టేషన్‌లను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. దత్తత గ్రామాలలో శాంతిభద్రతల పరిస్ధితులను తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.
NLR: సైదాపురంలో సోమవారం పాలూరులో జరిగే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొంటారని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాలపై తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.
KDP: కుందూ నది వంతెన కింద ఈతకు వెళ్లిన గొడుగు సురేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. మృతుడు ఆళ్లగడ్డ టౌన్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను పెద్దముడియంలో ఎద్దుల బండలాగుడు పోటీలను వీక్షించడానికి శనివారం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న నీటిలో మునిగి కనిపించలేదని, తిరిగి ఆదివారం వెతకగా.. మృతదేహం కనపడిందని పేర్కొన్నారు.
ASR: రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ జరుగుతుందని జేసీ స్మరణ్ రాజ్ ఆదివారం సాయంత్రం మీడియా ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం ITDA కార్యాలయం సమీపంలో ఉన్న మీటింగ్ హల్‌లో ఉదయం 10.30లకు ప్రారంభం అవుతుందన్నారు. పోలవరం జిల్లా వాసులు గమనించాలన్నారు. సమస్యలు పరిష్కారం కానివారు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
PPM: బలిజిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వాణిశ్రీ తెలిపారు. ఎంపీపీ నాగమణి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులంతా హాజరుకావాలని ఆమె కోరారు. సమావేశపు అజెండా నోటీసులను మండలస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేసినట్లు వెల్లడించారు.
AKP: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. ఆదివారం పాయకరావుపేటలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
TPT: సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ఎదురుగా ఉన్న కాళంగి నదిలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.