• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి’

AKP: మాజీ మంత్రి దివంగత గుడివాడ గుర్నాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మాట్లాడుతూ.. కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

March 23, 2026 / 05:41 AM IST

నేటి నుంచి కోదండ రామాలయంలో కల్యాణోత్సవాలు

శ్రీకాకుళం నగరం పాల కొండ రోడ్డులోని కోదండ రామాలయంలో సోమవారం నుంచి కోదండ రాముడి కల్యాణోత్సవాలు, శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నట్లు అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు. 27న శ్రీరామ చంద్ర మూర్తి కల్యాణం, 29న వార్షిక కల్యాణం, 31న రథోత్సవం, ఏప్రిల్ 2న పట్టాభిషేకం, 3న పుష్పయాగ మహోత్సవం జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

March 23, 2026 / 05:27 AM IST

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై

SKLM: పలాస(M) తర్లాకోటలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ తమ సెల్ ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.

March 22, 2026 / 10:02 PM IST

చేనేత కళాకారులకు కూటమి ప్రభుత్వం అండ: మంత్రి

సత్యసాయి: రాష్ట్రంలోని చేనేత కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. విజయవాడలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాను ఆమె సందర్శించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు రూ. 4,000 పెన్షన్, ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల్లోనే రూ. 47.35 లక్షల అమ్మకాలు జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.

March 22, 2026 / 10:00 PM IST

గరికపాటి వ్యాఖ్యలపై నిరసన

BPT: పేద విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బాపట్లలో వివిధ ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

March 22, 2026 / 10:00 PM IST

కూటమి బలోపేతంపై పల్లా దిశానిర్దేశం

VSP: గాజువాకలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కూటమి బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి లక్ష్యాలపై నాయకులతో చర్చించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు.

March 22, 2026 / 09:57 PM IST

గజవాహన సేవలో భక్తులను మంత్రముగ్ధులను చేసిన రాముడు

TPT: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గజవాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉత్సవాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దాయి.

March 22, 2026 / 09:53 PM IST

‘దేహదారుఢ్యంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది’

VZM: దేహదారుఢ్యంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఆదివారం రింగ్ రోడ్‌లో విశాల్ మార్ట్‌ పై అంతస్తులో నూతనంగా అత్యాధునికమైన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

March 22, 2026 / 09:37 PM IST

కంటి వైద్య శిబిరం.. వందమందికి కంటి పరీక్షలు

CTR: సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె ఎంపీపీ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో నిర్వాహకులు 100 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 22, 2026 / 09:32 PM IST

నిత్య అన్నదానం ట్రస్ట్‌కు భారీ విరాళం

CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,000 విరాళాన్ని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన దాత రాజశేఖర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 09:31 PM IST

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

AKP: జిల్లాలో రేపు పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఈ కారణంగా వీటిని రద్దు చేస్తున్నామన్నారు.

March 22, 2026 / 09:30 PM IST

ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పెద్దపీట..!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 14.7 లక్షలతో రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనను సమావేశం ఆమోదించడం జరిగిందని ఉమ్మడి ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఆదివారం తెలిపారు. ఏలూరులో జడ్పీ సమావేశం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12.23 లక్షలతో సవరించిన బడ్జెట్‌ను ఆమోదించారు.

March 22, 2026 / 09:29 PM IST

జాబ్ క్యాలెండర్‌పై వైకుంఠం జ్యోతి హర్షం

KRNL: ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండరు టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి స్వాగతించారు. ఇవాళ మాట్లాడుతూ.. CM చంద్రబాబు, యువనేత లోకేశ్ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఉద్యోగాల క్యాలెండర్ విడుదలతో నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

March 22, 2026 / 09:23 PM IST

బయనపల్లెలో వైసీపీ సమావేశం..!

KDP: బద్వేల్ మండలం బయనపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి యువత సమావేశం జరిగింది. జిల్లా సేవాదళం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు.

March 22, 2026 / 09:21 PM IST

సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్

ASR: డుంబ్రిగూడ(M) అమలగూడలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం మండల నాయకులు, గసబ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ.. సొవ్వ పంచాయతీ దేముడు వలస జంక్షన్ నుంచి అమలగూడ వరకు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. గతంలో కొంత మేర రోడ్డు నిర్మించి మిగతా భాగం వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 22, 2026 / 09:11 PM IST